Sunday, April 28, 2024

ఆదివాశీ ఆడబిడ్డకు అర్హత లేదా..?

తప్పక చదవండి
  • సీతక్క సీఎం అయితే..? ఏంటి నష్టం..?
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్వంత పార్టీలోనే దుమారం..
  • సీతక్క అభ్యర్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న స్వంత పార్టీ నేతలు..
  • సీఎం ఎవరనే విషయం పై కామెం ట్స్ చేయొద్దంటూ వార్నింగ్..
  • భట్టి విక్రమార్కకు చెక్ పెట్టే యోచనలో రేవంత్ అంటూ ప్రచారం..

గిరిజనులన్నా, ఆదివాశీలన్నా మొదటినుంచి అందరికీ చిన్నచూపు ఉంది.. అడవుల్లో జీవనం సాగిస్తూ.. కేవలం సేవలు చేయడానికి మాత్రమే పనికివస్తారని.. అడవి జంతువులతో సహవాసం చేస్తూ.. జంతువుల్లాంటి మనస్తత్వం కలిగివుంటారని భావిస్తూ ఉంటారు.. కానీ ఎంతో మంథి గిరిజనులు, ఆదివాశీలు అగ్రస్థానానికి చేరిన విషయాన్ని ఇప్పటికీ గుర్తించలేకపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం.. ఒక అడవి పుత్రుడైన వాల్మీకి రామాయణ మహా కావ్యాన్ని రచించి అందించిన చరిత్రను కూడా సోకాల్డ్ పెద్దమనుషులు జీర్ణించుకోలేకపోవడం శోచనీయం.. ఇప్పుడు ఉన్నత సేవా తత్పరత కలిగిన ఆదివాసీ బిడ్డ సీతక్క కు కూడా సీఎం అయ్యే అర్హత ఉంది అని రేవంత్ చేసిన కామెంట్స్ పై విపరీత ధోరణితో విమర్శలు చేస్తున్నారు.. ఇది అంత మంచి పరిణామం కాదని రాజకీయ విశ్లేషకులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు..

సీతక్క ఇప్పుడు ఓ ప్రజా ప్రతినిధి . తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. ఇదివరకు ఆమె మావోయిస్టుగా పనిచేశారు. ఆమె గతం అంతా నక్సలైట్‌గానే సాగింది. మావోయిస్టుగా అడవుల్లో తిరిగారు. గన్ను పట్టుకుని గిరిజనులు, ఆదివాసీలు, పేద ప్రజలకు అండగా నిలిచారు. ఆమెను అసలు పేరుతో పిలిస్తే.. బహుశా ఎవ్వరూ పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ.. మావోయిస్టు నాటి పేరుతో పిలిస్తే ఆమె కోట్లాదిమందికి సుపరిచితురాలు.ఇప్పుడు ఆమె తెలంగాణలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క అసలు పేరు అనసూయ. అసలు పేరు కంటే సీతక్క పేరుతోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె సుపరిచుతురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ములుగు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- Advertisement -

ఆదివాసుల ఆడ బిడ్డై ప్రతి గడపకు సాయం చేసింది :
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్‌డౌన్ పరిస్థితుల్లో సీతక్క గిరిజనులు, ఆదివాసీల కోసం అండగా నిలిచారు. అడవి బిడ్డల ఆకలిని తీర్చడానికి అహర్నిశలు శ్రమించారు.. దట్టమైన అడవుల్లో నివాసం ఉంటోన్న గిరిజనుల కోసం నిత్యావసర సరుకులను సరఫరా చేరవేయడానికి ఎన్నోప్రయాసలకు ఓర్చుకుని కాలినడకన అడవులను సైతం లెక్క చేయకుండా, ఊరూరా తిరిగారు. కొండలను ఎక్కిదిగారు. సామాన్యుల్లో సామాన్యురాలిగా గిరిజనుల ఆకలిని తీర్చి ఆదివాసుల ఆడబిడ్డయి ప్రతి గడపకు సాయం చేశారు.

అభివృద్ధికి ఆమడ దూరంలో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం :
ములుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గిరిజనులు, ఆదివాసీల సంఖ్య అధికం. అందుకే దీన్ని ఎస్టీ రిజర్వ్ గా ప్రభుత్వం ప్రకటిచింది. గిరిజనులు నివసించే గ్రామాలన్నీ మారుమూలల్లోని అడవుల మధ్యలో ఉంటాయి. ఆయా గ్రామాలకు వెళ్లాలంటే సరయిన రోడ్డు మార్గం ఉండదు. కాలినడక వెళ్లాలంటే ఇక మాటల్లో చెప్పాల్సిన పనేలేదు.. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని పయనం కొనసాగించాల్సిందే . కానీ లాంటి ప్రాంతాలకు హంగులు ఆర్భాటాలు లేకుండా గిరిజనులు, ఆదివాసీల ఆకలిని తీర్చారు సీతక్క. మావోయిస్టుగా అడవుల్లో తిరిగిన అనుభవం అప్పుడు తనకు ఎంతో ఉపయోగపడిందని ఆమె పదే, పదే చెప్పుకొచ్చారు. ఓ సామాన్యురాలిగా ఎడ్లబండిలో, ట్రాక్టర్లలో తిరుగుతూ అడవి బిడ్డల ఆకలితీర్చారు.

సీతక్క అభ్యర్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న స్వంత పార్టీ నేతలు :
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి చెక్‌ పెట్టడానికి సీఎం అభ్యర్థిగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పార్టీలో సీనియర్లు తెరపైకి తీసుకురాగా, ప్రతిగా భట్టికి చెక్‌ పెట్టడానికి సీతక్కను రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకువచ్చారన్న ప్రచారం జోరందుకుంది . భట్టి దళిత నేత కాగా.. సీతక్క గిరిజన నేత. దళితుడికి పోటీగా గిరిజన నేత సీతక్కను తెరపైకి తీసుకరావడం ద్వారా పార్టీలో అటు సీనియర్లకు, ఇటు భట్టికి చెక్‌ పెట్టినట్టుగా ఉంటుందన్నది రేవంత్‌రెడ్డి వ్యూహంగా కాంగ్రెస్‌ వర్గాలే చర్చింకుంటున్నాయి.

సీఎం ఎవరనే విషయంపై కామెం ట్స్ చేయొద్దంటూ వార్నింగ్ :
అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి .. ఇండియన్ ఓవర్సీ స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో గిరిజన మహిళగా సీతక్క సీఎం అయ్యే అవకాశం లేకపోదన్న వ్యాఖ్యలపై పార్టీలో, అటు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఎస్సీ, ఎస్టీల పట్ల కాం గ్రెస్ వైఖరి ఎలా ఉంటుంది? ఎస్సీ ల నుంచి భట్టివిక్రమార్కను సీఎంగా ప్రతిపాదిస్తున్నారు. మరి ఎస్టీల నుంచి సీతక్కకు కనీసం ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా? అన్న ప్రశ్నకు స్పందించిన రేవం త్.. కాం గ్రెస్ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ముగ్గురు సీఎం లు ఓబీసీలే ఉన్నారని చెప్పారు. పేదలు, ఓబీసీ, ఎస్సీ , ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షాన పార్టీకి
స్పష్టమైన విధానం ఉందని చెప్పా రు.. .అయితే, ఫలానా పోస్టుకు ఫలానా నేతను ఎంపిక చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పదని స్ప ష్టం చేశారు.
అయితే సీతక్కకు ఉపముఖ్య మంత్రి పదవి ఇవ్వాలన్న ఎన్ఆర్ఐల సూచనను పార్టీ వేదికల మీద చర్చిస్తామని, అవసరమనుకుంటే సందర్భాన్ని బట్టి సీతక్క సీఎం కూడా అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు స్పందిస్తూ ఇప్పుడే సీఎం ఎవరనే విషయంపై కామెంట్స్ చేయొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నా రు.

ఖమ్మం సభను భట్టి అభినందగా మార్చిన రేవంత్ వ్యతిరేక వర్గం :
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభను రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గీయులు దీనిని భట్టి అభినందన సభగా మార్చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం పదవి దళితుడైన భట్టికే దక్కుతుందన్న ప్రచారాన్ని రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించే నాయకులు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టేందుకు రేవంత్‌రెడ్డి వేసిన పాచికగా సీతక్క పేరును తెరపైకి తెచ్చి ఉంటారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో ‘తానా’ సభ వేదికగా సీఎం అభ్యర్థిగా సీతక్క పేరును రేవంత్‌రెడ్డి ప్రకటించడం పార్టీలో సీనియర్లకు మింగుడు పడటం లేదు. రేవంత్‌ చేసిన ప్రతిపాదన భట్టికి చెక్‌ పెట్టడానికేనని పార్టీలో కొందరు నాయకులు అభిప్రాయపడుతుండగా, టీడీపీ నుంచి తన వెంట కాంగ్రెస్‌లోకి వచ్చిన సీతక్క అయితే తాను చెప్పినట్టు వింటుందన్నది ఆయన ఎత్తుగడ కావచ్చని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద సీతక్క పేరును రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకురావడంతో కాంగ్రెస్‌లో ఇంకో కొత్త పంచాయితీ రాజుకున్నట్టు అయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు