- బీ.ఆర్.ఎస్. పార్టీలో చేరిన గాయకుడు ఏపూరి సోమన్న..
- మధుసూదనాచారి, బాల్క సుమన్ సమక్షంలో
గులాబీ కండువా కప్పుకున్న మాజీ వై.ఎస్.ఆర్.టి.పీ. మాజీ నేత..
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు, వై.ఎస్.ఆర్.టి.పీ. మాజీ నేత ఏపూరి సోమన్న బీ.ఆర్.ఎస్. పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.. మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ల సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.. ఈ సందర్బంగా ఏపూరి మాట్లా డుతూ… తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదని అన్నారు.. రాష్ట్రంలో విపక్షాలు విఫలం అయ్యాయని అన్నారు.. నేను నా ఇంటికి తిరిగి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఏపూరి తెలిపారు.. దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణ భవన్‌లో అడుగుపెట్టడం అనిర్వచనీయ అనుభూతి కలిగించిందని తెలిపారు.. కేసీఆర్ పాలనలో ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అన్ని విధాలుగ అందుతున్నాయన్నారు..