Tuesday, July 16, 2024

పేదోళ్లకు పనిచేయని ధరణి..

తప్పక చదవండి
  • కబ్జాదారులకు తొత్తుగా మారిన నల్లబెల్లి తహశీల్దార్..
  • కలెక్టర్ ను తప్పుదోవ పట్టించిన వైనం..
  • కాసులిస్తేచాలు ఇష్టా రీతిలో నాలా కన్వర్షన్స్..
  • ధరణి లో బుక్ అయిన స్లాట్ నీ నిలిపి వేసిన దూలం మంజూల..
  • నల్లబెల్లి తహశీల్దార్ కు ధరణి లో ప్రత్యేక నిబంధనలు ప్రభుత్వం పెట్టిందా..?
  • తహశీల్దార్ అక్రమాల పై వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య దృష్టి సారించాలి..
  • అవినీతి నిరోధక శాఖా అధికారులు విచారణ చేస్తే కళ్ళు బైర్లు కమ్మే
    నిజాలు బట్ట బయలు అవుతాయి..

హైదరాబాద్ : వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలంలో ధరణిలో కుంటిసాకులు పెడుతున్న తహశీల్దార్ దూలం మంజూల.. రెవెన్యూ రికార్డులతో పని లేదు.. నకిలీ పత్రాలు సృష్టించి ఎలాంటి లే అవుట్ అనుమతి లేకుండా అక్రమ కార్య కలాపాలకు పాల్పడే వారితో లోపాయకారి ఒప్పందం చేసుకొని, నాటి జిల్లా కలెక్టర్ గోపిని తప్పుదోవ పట్టించిదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ధరణిలో స్లాట్ బుక్ అయితే ఆపేది లేదని రాష్ట్ర ప్రభుత్వమే తేల్చి చెప్పినా.. ఇదంతా డోంట్ కేర్ అంటూ ధనార్జనే ద్యేయంగా పని చేస్తున్న తహశీల్దార్ ధరణి చట్టానికి తూట్లు పొడుస్తూ తాను చెప్పిందే చట్టం.. చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరించడంతో పేద ప్రజలు ఇబ్బందులకు గురుతున్నట్లు బహరంగా విమర్శలు వినిపిస్తున్నాయి.. భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు తొత్తుగా మారిన తహశీల్దార్ స్లాట్ బుక్ అయిన తరువాత కరెంట్ లేదని, సర్వర్ పని చేయడం లేదని స్లాట్ నిలిపి వేసి, అసలు అక్కడ భూమే లేదని మాట మార్చడం, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి తప్పుడు సమాచారం ఇవ్వడం, తహశీల్దార్ అవినీతికి అద్దం పడుతోంది.. భూమి లేకపోతే ధరణిలో పట్టా అక్రమార్కులు ఎలా చేసుకున్నారు అన్న విషయానికి తహశీల్దార్ సమాధానం చెప్పాలి .. మండలంలో బర్ల కాపరి అయిన ఐలు కొమురు తల్లి లేని పిల్లలకు రాసి ఇచ్చిన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న వారిలో వరంగల్ పోలీస్ కమిషనర్ భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవడం చూసి, సీపీకి పిర్యాదు చేస్తామని బాధితులు తెలుపగానే ఇద్దరు వ్యక్తులు అప్రూవర్ గా మారి చేసిన తప్పును ఒప్పుకుని తిరిగి సాదం ఐలు కొమురు భూమిని ఇచ్చేయుటకు ధరణిలో స్లాట్ బుక్ చేశారు.. స్లాట్ బుక్ చేసిన వ్యక్తులకు కొంత భూమిని తహశీల్దార్ దూలం మంజులా నాలా కన్వర్షన్ సైతం చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. జిల్లా కలెక్టర్ కు భూమి లేదని తెలిపిన తహశీల్దార్ నాలా కన్వర్షన్ ఎలా చేసింది..? అంటూ బాధితుడు ఐలు కొమురు ఆరోపించాడు.. ప్లాట్లు ఉన్నాయంటూ చెప్పే వ్యక్తుల సర్వే నెంబర్ మైలగాని శివయ్య అనే వ్యక్తికి సంబంధించిన పట్టా భూమిగా ధరణిలో ఉంది.. ఆ సర్వే నెంబర్ తో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అక్కడ భూమిలోకి వెళ్ళాలి.. భూ కబ్జాదారుల నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నతహశీల్దార్ ధరణి గ్రీవెన్స్ లో ఎలాంటి దరఖాస్తు లేకుండా, తానే స్వయంగా నాటి జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించి, నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులకు అండగా నిలిచి ధరణి చట్ట నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. అందిన కాడికి దోచుకుంటుందని చాలామంది రైతులు, విద్యా వంతులు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.. డబ్బులు ఇస్తే చాలు ఒక వ్యక్తికి సంబంధించిన ఒకే సర్వే నెంబర్లో 01 గుంట, రెండు గుంటలు మాత్రమే నాలా కన్వర్షన్ చేస్తుండటం అందరిని ఆశ్ఛర్యానికి గురి చేస్తుంది.. దీనితో నల్లబెల్లి మండల తహశీల్దార్ కు ధరణిలో ప్రత్యేక నిభందనలు ప్రభుత్వం కల్పించిందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. అవినీతి నిరోధక శాఖా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపితే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్ట బయలు అవుతాయని పలువురు సామజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పందించి నల్లబెల్లి తహశీల్దార్ నాటి జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన విషయంపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుని, ప్రజలకు పారదర్శకంగా పాలన అందేలా చూడాలని ఈ ప్రాంత పేద ప్రజలు కోరుతున్నారు.. తహశీల్దార్ అక్రమాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు