Saturday, April 27, 2024

ప్రభుత్వ బోర్డును తొలగించి సొంత బోర్డు ఏర్పాటు..

తప్పక చదవండి
  • కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని మింగేందుకు యత్నం..
  • కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు..
  • చోద్యం చూస్తున్న డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్..
  • కలెక్టర్ కల్పించుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు..
  • సర్వే నెంబర్ 170లోని 10 గుంటల ప్రభుత్వ భూమి..
  • శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో వెలుగు చూసిన యధేచ్ఛ కబ్జా చరిత్ర..

రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.. బాగానే ఉంది.. బోర్డుతో సరిపెట్టి దానికి రక్షించాల్సిన అధికారులే కబ్జా దారులకు కొమ్ముకాస్తూ.. తమ విధులను, విలువలను తాకట్టు పెట్టడం శోచనీయం.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, చందా నగర్ లో కబ్జాకోరులు, కొందరు రెవెన్యూ అధికారులు కలిసి ప్రభుత్వ భూమిని భోంచేస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది.. వివరాలు ఒకసారి పరిశీలిద్దాం..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, శేరిలింగం పల్లి మండలం, చందా నగర్ లోని కోట్ల రూపాయల విలువగల ప్రభుత్వ భూమి కబ్జాకు గురౌతోంది.. సర్వే నెంబర్ 170లో 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది.. గతంలో ఈ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు రెవెన్యూ అధికారులు.. అయితే ఈ భూమికి ఆనుకుని ఉన్న కొందరు పట్టా భూముల యజమానులు ఈ భూమిని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు… అయితే కబ్జా చేస్తున్న ఈ పట్టా భూముల యజమానుల భూములు కూడా డిస్ప్యూట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.. కాగా అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి, ప్రయివేట్ వ్యక్తులు కబ్జా పెట్టినట్లు తెలుస్తోంది.. గతంలో అధికారులు, ఈ ప్రభుత్వ భూమికి సంబంధించిన హద్దులను సర్వే చేసి హద్దు రాళ్ళను, మార్కింగ్ చేయవలసిన బాధ్యతగల మండల సర్వేయర్ మహేష్ ఆ పని చేయకుండా ప్రత్యక్షంగా కబ్జాదారులకు ముడుపులు తీసుకొని సహకరిస్తున్నాడని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూములు కాపాడవలసిన బాధ్యతగల శేర్లింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ప్రభుత్వ భూమి కాపాడడంలో నిర్లక్ష్యం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతగాడిపై గతంలో అనేక ఆరోపణలు వచ్చినా ఈరోజు వరకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఆదాబ్ హైదరాబాద్ ఈ విషయంపై తేదీ 21 ఏప్రిల్ 2023
“కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కైకల్యం” అనే శీర్షికతో వార్తా కథనం ప్రచురించిన అనంతరం భాను కన్ స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసిన బోర్డును తొలగించడం జరిగింది. కానీ సర్వే నెంబర్ 170 లో ఉన్న కంటైనర్ ను ఇస్తామని రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సీనయ్య పలుమార్లు ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధితో తెలపడం జరిగింది. కానీ భాను కన్ స్ట్రక్షన్స్ కంపెనీ వారు ఏకంగా ప్రభుత్వం తొలగించిన బోర్డును తిరిగి యధావిధిగా పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.. గతంలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డ కబ్జా దారులపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోకుండా ఉండడం వలన.. మళ్లీ ప్రభుత్వ బోర్డును తొలగించి వారి బోర్డును ఏర్పాటు చేసుకున్నారంటే.. వారికి అధికారులు అండ దండలు ఎంతవరకు ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడి.. నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భాను కన్ స్ట్రక్షన్స్ కబ్జా భాగోతం.. వారికి సహరిస్తున్న రెవెన్యూ అధికారుల చరిత్రను.. పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు