Sunday, April 21, 2024

గాజాలో 250 హమాస్‌ టార్గెట్ల‌పై ఐడీఎఫ్ అటాక్‌..

తప్పక చదవండి
  • 250 హమాస్ కేంద్రాలపై దాడి చేసిన ఇజ్రాయిల్ రక్షణ దళాలు..
  • మిస్సైల్ లాంచర్ ను టార్గెట్ చేసిన ఐడీఎఫ్ దళాలు..

జెరుస‌లాం : ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు.. 250 హ‌మాస్ కేంద్రాల‌పై దాడి చేశాయి. ఓ మ‌సీదు ప‌క్క‌న ఉన్న మిస్సైల్ లాంచ‌ర్‌ను కూడా ఐడీఎఫ్ ద‌ళాలు టార్గెట్ చేశాయి. వైమానిక ద‌ళానికి చెందిన జెట్ ఫైట‌ర్లు గాజా స్ట్రిప్‌లో ఉన్న హ‌మాస్ టెర్ర‌ర్ గ్రూపుకు చెందిన‌ సుమారు 250 కేంద్రాల‌ను పేల్చివేసిన‌ట్లు ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు పేర్కొన్నాయి. హ‌మాస్ క‌మాండ్ సెంట‌ర్లు, ట‌న్నెళ్లు, రాకెట్ లాంచ‌ర్లను ధ్వంసం చేశారు. పౌరులు నివ‌సించే ప్ర‌దేశాల నుంచి రాకెట్ లాంచ‌ర్ల‌తో హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఇజ్రాయిల్ వైపు అటాక్ చేశార‌ని, ఆ లాంచ‌ర్ల‌ను పేల్చివేసిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఖాన్ యూనిస్‌లో ఉన్న హ‌మాస్‌కు చెందిన‌ స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ లాంఛ‌ర్‌ను నౌకాద‌ళం పేల్చిన‌ట్లు ఐడీఎఫ్‌ వెల్ల‌డించింది. రాకెట్ లాంఛ‌ర్ ఓ మ‌సీదు, పిల్ల‌లు స్కూల్ స‌మీపంలో ఉంద‌ని, అంటే పౌరులు నివ‌సించే కేంద్రాల‌ను హ‌మాస్ ఉగ్ర‌వాదులు వాడుకుంటున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ఐడీఎఫ్ తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు