Monday, May 20, 2024

చాలాకాలం తరవాత ప్రశాంతంగా నిద్రపోయా

తప్పక చదవండి
  • ఎగ్జిట్‌ పోల్స్‌ తిప్పితిప్పి చెబుతున్నాయి
  • అసలు ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి
  • మంత్రి కేటీిఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ : చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయానని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈమేరకు కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. అసలైన ఫలితాలు మాకు శుభవార్తలు చెబుతాయి ‘ అని కెటిఆర్‌ పేర్కొన్నారు. గురువారం పోలింగ్‌ అనంతరం నిర్వహించిన విూడియా సమావేశంలో కెటిఆర్‌ మాట్లాడుతూ 88 సీట్లు వస్తాయని భావించామని.. వేర్వేరు కారణాల వల్ల 70కి పైగా స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంత్రి కేటీఆర్‌ సోషల్‌ విూడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన ఒక ఆసక్తికర ట్వీట్‌ చేశారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ వెల్లడిరచారు. ఆ తరువాత ఎగ్జిట్‌పోల్స్‌పై కూడా స్పందించారు. అయితే ఎగ్జిట్‌పోల్స్‌ అనంతరం ఆయన చెప్పిన మాటనే తిప్పి తిప్పి చెబుతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అనేవి పొలిటికల్‌ హీట్‌ను పెంచవచ్చు కానీ ఎగ్జాక్ట్‌ పోల్స్‌ మాత్రం పక్కాగా శుభవార్తను అందజేస్తాయని పేర్కొన్నారు.నిన్న పోలింగ్‌ ముగియగానే కొన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదల చేశాయి. అధికార పార్టీ అయితే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మడం లేదు. మంత్రి కేటీఆర్‌ 70కి పైగా స్థానాల్లో అధికారంలోకి వస్తామని ఇప్పటికీ చాలా నమ్మకంగా చెబుతున్నామన్నారు. రియల్‌ పోల్‌ రిజల్ట్‌ డిసెంబర్‌ 3న వస్తుంది కాబట్టి కార్యకర్తలు ఎవరూ కంగారపడవద్దని సూచిస్తున్నారు. డిసెంబర్‌ 3 న తప్పని తేలితే ఎగ్జిట్‌ పోల్స్‌ చేసినవారు ప్రజలకి క్షమాపణ చెబుతారా అని మరీ ప్రశ్నిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు