Monday, April 29, 2024

వరంగల్‌లో భారీ భూకంపం..

తప్పక చదవండి
  • భయంతో వణికిపోయిన జనాలు..
  • ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరుగలేదు..
  • ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్న అధికారులు..
  • ఇలా జరగడం సర్వసాధారణం..
  • సింగరేణి బొగ్గుగనుల బ్లాస్టింగ్స్ కూడా కారణం కావచ్చు..
  • ఒక ప్రకటనలో తెలిపిన ‘నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ’..

హైదరాబాద్ :
వరంగల్, మణుగూరులో శుక్రవారం తెల్లవారు జామున 4.43 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగాపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతంలో భూమి కంపించింది. ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా, గత వారం రోజుల వ్యవధిలోనే మణుగూరులో రెండుసార్లు భూమి కంపించింది. ఇలా వరుస ప్రకంపనలు వస్తుండటంతో జనాలు భయపడిపోతున్నారు. ఏం జరుగుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగష్టు 25న తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.. ఇంతలోనే.. భారీ కుదుపు.. అంతా ఊగిపోతున్నట్లుగా అనిపించింది. వెంటనే కళ్లు తెరిచి చూసే సరికి.. ఇంట్లోని వస్తువులు, ఫ్యాన్, ఇతర సామాగ్రి ఊగిపోతున్నాయి. నేల కదులుతోంది. దెబ్బకు హడలిపోయిన జనాలు.. వామ్మో భూకంపం అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సెకన్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందోనని బెదిరిపోయారు జనాలు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరులో కూడా శుక్రవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి. ఇక్కడ నమోదైన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6 గా నమోదైంది. భూకంప కేంద్రం 30 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఒక ప్రకటనలో తెలియజేసింది..

కాగా, వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భూప్రకంపనలు రావడంపై భూకంప అధ్యయన నిపుణులు స్పందించారు. భూమి లోపలి పొరల్లో అమరికల కారణంగా సాధారణంగానే భూ ప్రకంపనలు వస్తాయని. ఇది పెద్దగా ఆందోళన చెందాలన అంశం కాదని చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, ఇవి సర్వసాధారణం అని పేర్కొంటున్నారు నిపుణులు. ఇక సింగరేణి బొగ్గు గనుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య బ్లాస్టింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటి కారణంగా కూడా భూమి కంపించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు