- అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్య
భారతీయ విద్యార్థి అమెరికా కల ఆవిరైంది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ భారతీయుడి ప్రాణాలు పోయే వరకు దుండగుడు అక్కడే కూర్చున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ గా మారింది. వివరాళ్లోకి వెళ్తే… హర్యానాలోని బర్వాలాకు చెందిన వివేక్ సైనీ (25) ఎంబీఏ చేసేందుకు అమెరికాలోని జార్జియాకు వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే మరోవైపు జార్జియాలోని లిథోనియా ప్రాంతంలో గల దుకాణంలో గుమస్తాగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంది. దీంతో ఇళ్లు లేని ఓ నిరుపేద స్థానిక వ్యక్తి వచ్చి స్టోర్ లో ఆశ్రయం కోసం అర్ధించినట్లు తెలుస్తుంది. పరిస్థితి అర్ధం చేసుకున్న స్టోర్ నిర్వాహకులు మానవతా కోణంలో ఆ నిరుపేద వ్యక్తి తలదాచుకోవడానికి చోటు ఇచ్చారట. ఈ క్రమంలో ఆ వ్యక్తితో మాట్లాడిన వివేక్ సైనీ… ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి.. లేదంటే పోలీసులకు చెబుతాను అని హెచ్చరించాడట. దీంతో… కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి… వివేక్ పై సుత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో… వివేక్ సైనీ తలపై ఆ సుత్తితో సుమారు 50 సార్లు బాదడంతో.. వివేక్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని చెబుతున్నారు. హత్య అనంతరం సదరు దుండగుడు.. వివేక్ డెడ్ బాడీ వద్దే కూర్చుండిపోయాడు. ఇదంతా ఇదంతా దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.