Wednesday, May 1, 2024

విజయవాడ హైవేపై భారీ రద్దీ

తప్పక చదవండి
  • సొంతూళ్లకు బయలదేరిన వందలాది వాహనాలు
  • ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు
  • వరుసగా రెండోరోజూ తప్పని ట్రాఫఙక్‌ చిక్కులు

హైదరాబాద్‌ : విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. తెలంగాణ కంటే..ఆంధ్రప్రదేశ్‌ లో సంక్రాంతి పండగ భారీ స్థాయిలో జరుపుకుంటారు. ఎక్కడున్న కుటుంబ సభ్యులు అందరూ.. ఈ పండక్కి కలుసుకుని ఘనంగా జరుపుకుంటారు. పండక్కి వచ్చే జనాలతో ఏపీ గ్రామాలు కలకళలాడుతాయి. హైదరాబాద్‌ లో ఏపీ ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. దీంతో పండక్కి సొంతూరుకు బయల్దేరి వెళ్తున్నారు. వరుసగా శుక్ర,శనివారాల్లోనూ నగరం నుంచి ఏపీకి వెళ్లే వాహనాలతో హైవేలపై వాహనాల రద్దీ నెలకొంది. దీంతో టోల్‌గేట్ల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడిరది. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో ప్రజలు సొంతవూర్లకు పయనమ వుతుండడంతో హైదరాబాద్‌ ఖాళీ అవుతోంది.సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భాగ్యనగరం నుంచి గ్రామాలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివెళ్లడంతో ఎక్కడికక్కడ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తాయి. దీనికితోడు ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిరది. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాలకు వేల సంఖ్యలో వెళ్తున్న వాహనాలతో రద్దీ వాతావరణం కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్‌విజయవాడ హైవేపై నల్గొండజిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ దగ్గర వరుసగా మూడ్రోజులుగా భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడిరది. కిలోవిూటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆగడంతో రద్దీ చాలా పెరిగిపోతుందని వాహనదారులు చెబుతున్నారు. ఒకవైపు సొంత వాహనాలున్న వారు, మరోవైపు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. శనివారం మకర సంక్రాంతిని కుటుంబసభ్యులతో జరుపుకోవాలని ఇళ్లకు పయనమ వుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నగరం ఖాళీ అవుతుంటే.. పండక్కి గ్రామాలకు వెళ్లేవారితో టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. హైదరాబాద్‌విజయవాడ జాతీయరహదారిపై అర్ధరాత్రివరకు వాహనాల జాతర నెలకొంది. సంకాంత్రి సెలవులు రావడంతో.. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు ప్రయాణికులందరూ ఒకేసారి తరలివెళ్తున్నారు. రాజధాని నుంచి వచ్చే వాహనాలు యాదాద్రి భువనగిరిజిల్లా పంతంగి టోల్‌ప్లాజావద్ద బారులు తీరుతున్నాయి. ఖమ్మం, భద్రాది, నల్గొండ, గుంటూరు, ప్రకాశం, విజయవాడ, విజయనగరం, శ్రీకాకుళం వైపు వేళ్లే వాహనాలన్నీ ఈ టోల్‌ ప్లాజా విూదుగానే వెళ్లాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో విజయవాడ వైపు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. వీటిలో కార్లు అధికంగా ఉన్నాయి. వాహనచోదకులు టోల్‌ చెల్లించడానికి సుమారు అరగంటసేపు వేచిచూడాల్సి వచ్చింది. పోలీసులు జోక్యం చేసుకొని టోల్‌ చెల్లింపు కేంద్రాలను ఎక్కువగా తెరిపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పండక్కి రెండు రోజుల ముందే సొంతూళ్లకు పయనమవడంతో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. మరీ ముఖ్యంగా.. హైదరాబాద్‌`విజయవాడ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో ఉదయం నుంచే తీవ్రంగా ట్రాఫిక్‌
రద్దీ నెలకొంది. పెద్దసంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో ప్రజలు రోడ్డు దాటేందుకు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద వాహనాలు బారులుతీరాయి. టీఎస్‌ ఆర్టీసీ సంక్రాంతికి అదనపు వడ్డన లేకుండా సాధారణ చార్జీలతో ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ఎక్కువ మంది ఆ బస్సుల్లోనే వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. మహిళలకు ప్రీ కావడంతో రద్దీ పెరిగింది. ఏపీఎస్‌ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేకబస్సుల్లో 50శాతం అధిక చార్జీ వసూలు చేస్తుండడంతో ఏపీవాసులు సైతం హైదరాబాద్‌ నుంచి సొంతూరికి వెళ్లడానికి టీఎస్‌ ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యమిస్తున్నారు.గడిచిననాలుగు రోజుల్లో టీఎస్‌ ఆర్టీసీ ఏపీ, తెలంగాణల్లోని పలు జిల్లాలకు 2,700కు పైగా ప్రత్యేక సర్వీసులను నడిపింది. రద్దీ పెరిగితే మరిన్ని అదనపు బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇక.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ తీరును, ప్రత్యేక బస్సులను టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సూచనలు, సలహాలు స్వీకరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు