Saturday, May 18, 2024

హస్తినలో బిజీబిజీగా బండి

తప్పక చదవండి
  • పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు
  • తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చ
  • దశాబ్ది ఉత్సవాల్లో విద్యార్థి దుర్మరణం దారుణం
  • ప్రజల ఉసురు తీసుకునేందుకేనా ఉత్సవాలు
  • ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ బండి సంజయ్..
  • విద్యార్థి కుటుటంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌

న్యూ ఢిల్లీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. దేశ రాజధానిలో పార్టీ అగ్రనేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై పార్టీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ అగ్రనేతల పర్యటనల పైన కూడా వారితో చర్చిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఈ నెలాఖరున కేంద్రమంత్రి అమిత్ షా సభ ఏర్పాటుకు రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలతో బిజీగా ఉండనున్నారు. విదేశీ పర్యటనల అనంతరం మోదీ తెలంగాణ పర్యటనను కూడా ఖరారు చేయవచ్చు.

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆరవ తరగతి విద్యార్థి ట్రాక్టర్‌ కింద పడి దుర్మరణం చెందిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ స్పందించారు. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా అంటూ మండిపడ్డారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా బండి సంజయ్‌ స్పందిస్తూ… ‘తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో కమలాపూర్‌ మండలం మర్పెల్లిగూడెంలో 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్‌ దుర్మరణం దిగ్భ్రాంతికరం. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్ధిని దశాబ్ది ఉత్సవాలకు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఈ మృతికి బాధ్యత వహించాలి. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలి. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్‌ఎస్‌ సర్కార్‌ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా? ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రభుత్వ యంత్రాగంపై ఒత్తిడి తెస్తున్న ఈ సర్కార్‌.. విద్యార్థులను కూడా బలవంత పెట్టడం దారుణం. ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి విగతజీవిగా మారడానికి కారణమెవరు? ఆ తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారు? ఏం చెప్పి వారిని ఓదారుస్తారు..?. గతంలో ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని కొందరు మృతి చెందారు.. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కళ్యాణలక్ష్మీ చెక్కు తీసుకునేందుకు వచ్చిన మరో వృద్ధురాలిని రోజంతా నీరీక్షించేలా చేయించి ఆమె మృతికి కారణమయ్యారు.. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల్లో 6వ తరగతి చిన్నారి దుర్మరణం పాలయ్యాడు.. ప్రజల ప్రాణాలు తీసేందుకే విూ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా..?‘ అంటూ బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -

విషాదం చోటుచేసుకున్న తీరు :
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లాలో నిర్వహించిన విద్యాదినోత్సవం వేడుకల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. కమలాపూర్‌ మండలం మరిపెళ్లి గూడెంలో విద్యా దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఇనుగాల ధనుష్‌(10) అనే విద్యార్థి కూడా ర్యాలీలో పాల్గొన్నాడు. ర్యాలీ చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఒక కిరాణా దుకాణం కనిపించడంతో బిస్కెట్‌ ప్యాకెట్‌ తెచ్చుకునేందుకు ధనుష్‌ అక్కడకు వెళ్లాడు. అయితే బిస్కెట్‌ ప్యాకెట్‌ తీసుకుని వస్తుండగా వీధి కుక్కలు వెంట పడ్డాయి. దీంతో వాటి బారి నుంచి తప్పించుకునేందుకు పరిగెడుతుండగా.. ట్రాక్టర్‌ కింద పడి మృతి చెందాడు. ధనుష్‌ మృతితో తల్లిదండ్రులు జయపాల్‌, స్వప్న కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యమే విద్యార్థుల ప్రాణం తీసిందని గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాల నిర్వాహకులతో పాటు అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. అయితే బాలుడి మరణవార్త తెలుసుకున్న హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. విద్యార్థి తల్లిండ్రులతో, గ్రామస్థులతో ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని బాలుడి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ ఘటనపై తీవ్రగ్భ్భ్రాంతికి లోనైన ఈటల రాజేందర్‌.. ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు