Saturday, May 11, 2024

మందేసి, చిందేసి..

తప్పక చదవండి
  • పబ్‌లో హల్ చల్ చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి..
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
  • గతంలో ఎమ్మెల్యే సోదరుడి నిర్వాకం.. ఒక గాయకుడిపై దాడి..
  • విమర్శల పాలవుతున్న ప్రజా నాయకులు..
  • అది మా తమ్ముడి బర్త్ డే పార్టీ.. అక్కడ మా ఆవిడ
    తప్ప వేరే మహిళ లేదు. వివరణ ఇచ్చిన రోహిత్ రెడ్డి..

హైదరాబాద్, ఒక శాసనసభ్యుడి హోదాలో ఉండి ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రవర్తించాలి.. అనుచితంగా ఉంటే అడ్డంగా దొరికిపోతారు.. ఇప్పుడు ఆ పరిస్థితి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎదురైంది.. రోహిత్‌రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో బీర్ చిందిస్తూ ఎంజాయ్‌ చేశారాయన. యూత్‌కు ఆయన స్వయంగా మందు తాపించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గతంలో రోహిత్‌రెడ్డి తమ్ముడు సైతం ఓ పబ్‌లో ఇలానే చెలరేగిపోయాడు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి చేశాడు. తనపై దాడిని రాహుల్ తీవ్రంగా ఖండించాడు. మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ కూడా చేశాడు. ఈసారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డినే.. ఇలా పబ్‌లో మందేసి, చిందేసి.. విమర్శల పాలవుతున్నారు. ఫ్యామిలీకి ఫ్యామిలే పబ్బుల చుట్టూ తిరుగుతున్నారంటూ మండిపడుతున్నారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని.. ఇలా పబ్‌లో తాగుతూ, తాగిస్తూ.. ఎమ్మెల్యే పదవికి ఉన్న విలువను తగ్గిస్తున్నారని నెటిజన్లు కామెంట్లతో ఫైర్ అవుతున్నారు.

రోహిత్ రెడ్డి వివరణ :
పబ్‌ వీడియోపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి స్పందించారు. పబ్‌లో జరిగింది తన తమ్ముడి బర్త్‌డే పార్టీ అని…పార్టీలో తన సతీమణి తప్ప.. వేరే అమ్మాయిలు లేరని వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే పార్టీ చేసుకోకూడదా..? ఆ స్వేచ్ఛ లేదా..? అంటూ ప్రశ్నించారు. పబ్ వీడియోను కావాలనే కొందరు వైరల్ చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు