- 81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
- జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ
- మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ www.psc.ap.gov.in లో లభ్యమవుతాయని అధికారులు తెలిపారు