Sunday, May 5, 2024

తెల్లాపూర్‌లో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు

తప్పక చదవండి
  • మున్సిపల్‌ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం

సంగారెడ్డి : ప్రజాయుద్ధనౌక గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధి తెల్లాపూర్‌ మున్సిపాలిటీలోని రామచంద్రాపురంలో గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లభించింది. గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్‌ మున్సిపాలిటీ చేసిన తీర్మాణాన్ని ప్రభుత్వం ఆమోదించింది. గద్దర్‌ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్‌రెడ్డి మాటను ఇచ్చారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గద్దర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్‌ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్‌ఎండీఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ రేవంత్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా యుద్ధ నౌకగా పేరుగడిరచిన గద్దర్‌ అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన సమయంలో రాజకీయ పార్టీలు స్పందించి తీరు అప్పట్లో చర్చకు దారి తీశాయి. అయితే టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌ రెడ్డి మాత్రం గద్దర్‌ అంతిమయాత్రలో అన్నీ తానై ముందుకు నడిపించారు. గద్దర్‌ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్‌.. భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలు ఇలా అన్నింటిలో ముందుండి నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్‌ అంత్యక్రియలు జరిగినప్పటికీ.. అక్కడ అన్నీ చూసుకుంది మాత్రం రేవంత్‌ రెడ్డే. మొత్తానికి గద్దర్‌ను కాంగ్రెస్‌ తన సొంతమనిషిలా చూసుకుని ఘనంగా వీడ్కోలు పలికింది. కాగా.. గద్దర్‌ తన కుమారుడు సూర్యను రాజకీయాల్లో తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నిం చారు. అనుకున్నదే తడువుగా ఢల్లీి వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలను కలిసి కుమారుడితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనను కూడా పక్కన పెట్టి చివరకు వరకు కాంగ్రెస్‌ పార్టీతో సత్సంబంధాలు కొనసాగించారు. అయితే కుమారుడిని రాజకీయాల్లో ఉన్నంత స్థాయిలో చూడాలన్న కోరిక తీరకుండానే గద్దర్‌ ప్రాణాలు వదిలారు. అయితే గద్దర్‌ కోరికను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వచ్చింది. గద్దర్‌ కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. కుమారుడికి బదులుగా గద్దర్‌ కుమార్తె వెన్నెలకు గత ఎన్నికల్లో హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ టికెట్‌ను కేటాయించింది. అయితే ఆ ఎన్నికల్లో వెన్నెల ఓటమిపాలయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు