Friday, October 11, 2024
spot_img

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

తప్పక చదవండి
  • ఆర్టీసీ బస్సుల్లో చెలరేగిన మంటలు
  • హైద‌రాబాద్ దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ఘటన

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ముందుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో.. దాని పక్కనే ఉన్న మరో బస్సుకు ఈ మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు ఎక్కువ అయ్యి రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. అదృష్టం కొద్ది రెండు బస్సులకు మాత్రమే మంటలు వ్యాపించాయి. అప్పటికే ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బస్సులో మంటలు ఎలా వచ్చాయన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోటవంతో అందరూ ఊపిరిపీల్చున్నారు. బస్సులో షాట్ సర్క్యూట్ కావటం వల్ల ఈ మంటలు చెలరేగి ఉంటాయని డిపో అధికారులు భావిస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లయయ్యే ఛాన్స్ ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు