Tuesday, October 15, 2024
spot_img

ఫెస్టివెల్ ఆఫర్..

తప్పక చదవండి
  • దసరాకు బస్సుల్లో వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ గూడ్‌న్యూస్..
  • టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ఆర్టీసీ..
  • ముందస్తు బుకింగ్ చేసుకుంటే ఆఫర్ అప్లై..
  • ఎక్కడున్నా సరే సొంత ఊళ్లకు వచ్చి సంబురాలు
    చేసుకునే అతి పెద్ద పండుగ దసరా..
  • కుటుంబ సభ్యులందరితో పల్లెలు కళకళలాడే అద్భుతం..

హైదరాబాద్ : తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా… ఎవరు ఎక్కడ ఉన్నా సరే.. దసరా వచ్చిందంటే సొంత గ్రామాలకు చేరుతుంటారు. దసరాకు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తుంది. టీఎస్‌ఆర్టీసీ ప్రతి ఏటా స్పెషల్ బస్సు సర్వీసులను నడుపుతోంది. టికెట్లపై రాయితీ కూడా ఇస్తుంది. ఈ సారి కూడా దసరాకు ఆర్టీసీ బస్సుల్లో సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని చెప్పారు.

“బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలి” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు