Saturday, May 18, 2024

రెండు రోజుల ఉత్కంఠకు తెర

తప్పక చదవండి
  • ఆర్టీసీ బిల్లుకు ఆమోదం..
  • రవాణా శాఖ అధికారులతో గవర్నర్‌ చర్చలు
  • తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళిసై రెండు రోజుల ఉత్కంఠకు తెర..
  • ఆర్టీసీ బిల్లుకు ఆమోదం..
  • రవాణా శాఖ అధికారులతో గవర్నర్‌ చర్చలు
  • సందేహాలకు సమాధానమిచ్చిన ఆర్టీసీ అధికారులు
  • తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపిన తమిళిసై
    హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వం రూపొందించిన ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. రెండు రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత, పలు అంశాలపై స్పష్టత తీసుకుని ఓకే చెప్పారు. శానససభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ కన్సెంట్‌ ఇచ్చారు. గవర్నర్‌ ఆమోదంతో బిల్లుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం రవాణా శాఖ కార్యదర్శి, ఆర్టీసీ అధికారులతో రాజ్‌భవన్‌లో అర్ధగంటకు పైగా జరిగిన చర్చల అనంతరం గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. డ్రాఫ్టు బిల్లులోని అంశాలను పరిశీలించిన తర్వాత తలెత్తిన సందేహాలకు అధికారులు ఇచ్చిన వివరణతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల ఉత్కంఠకు తెర దించుతూ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు తాను వ్యతిరేకం కాదని.. వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని గవర్నర్‌ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రెండుసార్లు వివరణ వెళ్లినా.. ఆమె సంతృప్తి చెందకపోవడంతో రవాణా కార్యదర్శి సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇవాళ క్లారిఫికేషన్‌ ఇవ్వగా.. ఆమె సంతృప్తి చెందారు. ఆ తర్వాత రవాణాశాఖ అధికారులు అసెంబ్లీకి చేరుకున్నారు. గవర్నర్‌తో చర్చించిన విషయాలను సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించనున్నట్లు సమాచారం. మూడు రోజుల ఉత్కంఠ.. ఆర్టీసీ బిల్లు వ్యవహారంలో శనివారం పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని జులై 31న జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 3న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌ అనుమతి కోసం ఈనెల 2న బిల్లు డ్రాఫ్ట్‌ను రాజ్‌భవన్‌కు పంపారు. దీనిపై కొన్ని సందేహాలను వ్యక్తంచేస్తూ గవర్నర్‌ కార్యాలయం వివరణ కోరడం, ప్రభుత్వం సమాధానం ఇవ్వడం, గవర్నర్‌ రెండోసారి అదనపు సమాచారం కోరడం, మరోసారి ప్రభుత్వం తన వివరణ పంపడంతో సస్పెన్స్‌ కొనసాగింది. గవర్నర్‌ తీరును నిరసిస్తూ.. ఆర్టీసీ కార్మికులు శనివారం చలో రాజ్‌భవన్‌ కూడా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయంపూట రెండు గంటలపాటు బస్సులను నిలిపేశారు. రాజ్‌భవన్‌కు వచ్చిన కార్మికుల తరఫున పది మంది నాయకులతో చెన్నైలో ఉన్న గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. అనంతరం గవర్నర్‌ లేవనెత్తిన అంశాలపై సీఎస్‌ శాంతికుమారి వివరంగా లేఖ రాశారు. దానిపై సంతృప్తి చెందని గవర్నర్‌ మరో ఆరు అంశాలపై అదనపు సమాచారం కోరారు. ఈ విషయంపై మరింత స్పష్టత కోరడంతో ఇవాళ రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు గవర్నర్‌తో సమావేశమై వివరణ ఇచ్చారు. వారి వివరణతో సంతృప్తి చెందిన తమిళిసై.. బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ బిల్లుకు ఓకే చెప్పారు.
    గవర్నర్‌ చేసిన సూచనలు ఇలా ఉన్నాయి :
  • ఆర్టీసీకి ఉన్న ఆస్తులు, భూములు, ఇతర ప్రాపర్టీస్‌ ఆ సంస్థతోనే ఉండాలి. ఈ మేరకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అండర్‌టేకింగ్‌ ఇవ్వాలి.. – ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. అవసరమైతే ఔట్‌ సోర్సింగ్‌ సంస్థకు బాధ్యత అప్పజెప్పి సంస్థ (ఆర్టీసీ)పై ఆర్థిక భారం లేకుండా చూడాలి..- ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆర్టీసీ ఆస్తుల పంపిణీ విభజన చట్టం ప్రకారం పూర్తికావాలి.- సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉనికిలో ఉన్నప్పటి నుంచి చెల్లించాల్సిన బకాయిలను క్లియర్‌ చేయాలి.. – ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఇతర డిపార్టుమెంట్లలోకి డిప్యూటేషన్‌పై వెళ్తే వారి వేతనం, గ్రేడ్‌, పే స్కేల్‌, పదోన్నతులకు ఇబ్బంది లేకుండా చూడాలి.. – ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే పే స్కేల్‌, సర్వీస్‌ రూల్స్‌, నియమ నిబందనలు, బదిలీలు, వేతనాల చెల్లింపు,. పదోన్నతులు, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, పింఛన్‌, పీఎఫ్‌, గ్రాట్యుటీ తదితరాలు అమలుకావాలి.. – ఆర్టీసీ కార్మికులు స్ట్రెస్‌, స్ట్రెయిన్‌ లాంటి ఒత్తిడులతో బాధపడుతూ ఉద్యోగానికి ‘అన్‌ ఫిట్‌’గా మారితే మెడికల్‌ గ్రౌండ్స్‌కు అనుగుణంగా వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం అందాలి.. – ఆర్టీసీ సంస్థలో సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఇకపైన ప్రభుత్వంలో విలీనమవుతున్నందున మానవతా దృక్పథంలో ఉండేలా సర్వీస్‌ రూల్స్‌ నిబంధనల్లో మార్పులు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అమలు చేయాలి.. – కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారికి సమానంగా ఉండేలా చూడాలి. వారికి ప్రావిడెంట్‌ ఫండ్‌ సౌకర్యం అందాలి.. – రెగ్యులర్‌ లేదా నాన్‌-పర్మినెంట్‌ ఉద్యోగులు సర్వీసులో ఉన్నంతకాలం ప్రస్తుతం ఆర్టీసీలో వైద్యపరంగా అందుకుంటున్న సౌకర్యాలన్నీ ఇకపైన కూడా కొనసాగాలి.. ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ కూడా కంటిన్యూ కావాలి.- గవర్నర్‌ ఆమోదంతో ఇవాళే బిల్లు ను అసెంబ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును రూపొందిం చాలని అధికారులను ఆదేశించారు..- స్వల్పకాలిక చర్చ అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు