Saturday, July 27, 2024

ఆర్టీసీ బిల్లుతో పాటు, పురపాలక చట్టం సవరణ, పంచాయితీరాజ్‌ చట్ట సవరణ బిల్లులు ఆమోదం..

తప్పక చదవండి
  • ఆర్టీసీ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామన్న కేసీఆర్‌
  • సమ్మిళిత అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి
  • మనల్ని ముంచిందే ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌
  • మౌన ప్రేక్షకపాత్ర వహించింది తెలంగాణ కాంగ్రెస్సే : కేసీఆర్‌
  • గద్దర్‌ మరణంపై సంతాపం ప్రకటించిన మంత్రి కేటీఆర్‌
  • తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
    హైదరాబాద్‌ : ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దాంతోపాటు పురపాలక చట్ట సవరణ బిల్లును సైతం శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. కార్మికుల బకాయిలను చెల్లిస్తామని, ఆర్టీసీ కార్పొరేషన్‌, దాని ఆస్తులు అదే విధంగా ఉంటాయన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించి పదవి విరమణ ప్రయోజనాలు నిర్ణయిస్తామన్నారు. 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని చెప్పారు. కానీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కార్పొరేషన్‌ రూల్స్‌ ప్రకారం కొనసాగుతారని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. గత గురువారం ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు ఆదివారం వరకు కొనసాగాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఆదివారం శాసనసభలో తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక విలీన బిల్లుకు ఆమోదం
    చర్చ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు ఉద్యమంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి సాధించిన తీరును వివరించారు. అదేవిధంగా పురపాలక చట్టం సవరణ బిల్లును సైతం మంత్రి కేటీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపింది. దాంతో పాటు పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించానని గుర్తు చేసు కున్నారు. ప్రతిపక్ష, అధికార పక్ష నేతలతో పాటు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎనిమిది సెషన్లలో సజావుగా సాగేం దుకు, పద్దులపై చర్చించేందుకు, ప్రశ్నలకు జవాబులు ఇప్పించేం దుకు సహకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల బిల్లుపై గవర్నర్‌ తమిళిసై తెలిసీ తెలియక వివాదం చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభ సమావేశాలు చివరిరోజు సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొందరు ఆరోపణలు చేశారని, కానీ తాము ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు.
    ఆర్టీసీ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. త్వరలో ఆర్టీసీ సేవలు విస్తరిస్తామని, యువ ఐఏఎస్‌లను నియమించి మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి చేసిన సూచనలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు. ఉద్యోగుల భవిష్యత్‌, రక్షణ కోసం తాను కొన్ని విషయాలపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరాను తప్పా, ఆ బిల్లును ఆపడం తన ఉద్దేశం కాదని గవర్నర్‌ పదే పదే ప్రస్తావించడం తెలిసిందే. ఇక తెలంగాణలో రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటాం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తెలిపారు. కిందటి ఏడాది హైదరాబాద్‌లో తీవ్ర నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన కేసీఆర్‌.. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ‘వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి జాడ లేదు’ అంటూ తెలంగాణ బీజేపీపై విమర్శలు చేశారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కరెంటు, రైతు బంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారని కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే 420 కేసులు వేశారని చెప్పారు. ధాన్యం దిగుమతిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమిస్తోందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 7 లక్షల టన్నుల యూరియా వాడే తెలంగాణ నేడు 27 లక్షల టన్నులు వాడుతోందని తెలిపారు. తెలంగాణ గోదాముల్లో ప్రస్తుతం కోటి టన్నులు ధాన్యం ఉందని, వేలం ద్వారా విక్రయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రిని ఆదేశించానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలోనే 30`40 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించామని వెల్లడిరచారు.
    వ్యవసాయ మోటార్లకు విూటర్లు పెట్టకపోతే ఎఫ్‌ఆర్‌బీఎంలో కేంద్రం కోత విధించిందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. దీంతో ఏటా రూ. 5,000 కోట్లు నష్టపోతున్నామని తెలిపారు. కేంద్రం వైఖరి వల్ల ఐదేళ్లలో రూ. 25 వేల కోట్లు నష్టపోయామని చెప్పారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం.. అవార్డులు మాత్రం ఇచ్చిందని కేసీఆర్‌ అన్నారు. పారిశుద్ధ్యం, మంచినీటి విషయంలో కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల మంచినీరు ఇస్తున్నామని చెప్పారు. ‘పల్లెలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నాం. 13 రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు వచ్చి మన మిషన్‌ భగీరథను అధ్యయనం చేస్తున్నాయి. తండాలు, గిరిజన ఆవాసాల్లో రోగాలు కనిపిస్తున్నాయా ఇప్పుడు? దేశంలోనే వీధి నల్లాలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ధరణి పుణ్యమా అని 10 నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు పూర్తవు తున్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. రైతు మరణించిన వారం రోజుల్లోనే అతడి కుటుంబానికి రూ. 5 లక్షలు అందుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో 35,000 చెరువులు అదృశ్యమయ్యాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ శాసనసభపక్ష నేత భట్టి విక్రమార్క మరోసారి పాదయాత్ర చేయాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు