Monday, April 29, 2024

ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్..

తప్పక చదవండి

ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ కు పోటీగా తీసుకొచ్చిన ఈ యాప్ పై కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘థ్రెడ్స్’ యాప్ ను తీసుకొచ్చేందుకు మెటా కేవలం కీబోర్డులోని Crl+C+V (కాపీ పేస్ట్) కీలను మాత్రమే వినియోగించిందంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

మస్క్‌ నేతృత్వంలోని ట్విట్టర్‌కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ కొత్త యాప్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా.. తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త ‘థ్రెడ్స్’ యాప్ ను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌ చేసుకోవచ్చు. ఇందులో సుమారు వర్డ్స్‌తో లింక్స్‌, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను సైతం పోస్ట్‌ చేసుకోవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు