Friday, April 26, 2024

న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుప‌ట్టిన ఎల‌న్ మ‌స్క్‌..

తప్పక చదవండి

ర‌హ‌స్య ప‌త్రాలు క‌లిగి ఉన్న కేసులో .. అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై నేరాభియోగాలు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో మంగ‌ళ‌వారం మియామి కోర్టు ముందు ట్రంప్ హాజ‌రుకానున్నారు. అయితే అమెరికా న్యాయ వ్య‌వ‌స్థ తీరును ఎల‌న్ మ‌స్క్ ప్ర‌శ్నించారు. ఇత‌ర నాయ‌కుల్ని వ‌దిలేసి కేవ‌లం ట్రంప్‌ను విచారించేందుకు న్యాయ వ్య‌వ‌స్థ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు మ‌స్క్ త‌న ట్విట్ట‌ర్‌లో ఆరోపంచారు.

రిప‌బ్లిక‌న్ పార్టీకి అనుకూలంగా ఉండే టెస్లా, స్పేస్ఎక్స్‌, ట్విట్ట‌ర్ సంస్థ‌ల ఓన‌ర్ మ‌స్క్.. మాజీ అధ్య‌క్షుడు ట్రంప్‌ను చ‌ట్ట‌ప‌ర‌మైన సంస్థ‌లు రాజ‌కీయంగా టార్గెట్ చేసిన‌ట్లు ఆరోపించారు. న్యాయ వ్య‌వ‌స్థ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు విభిన్నంగా ఉంద‌ని, ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే ఆ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం పోతుంద‌ని మ‌స్క్ త‌న ట్వీట్‌లో తెలిపారు. గ‌త ఏడాది ట్విట్ట‌ర్‌ను టేకోవ‌ర్ చేసుకున్న మ‌స్క్‌.. కొన్ని రోజుల‌కే వివాదాస్ప‌ద ట్రంప్ అకౌంట్‌ను పున‌రుద్దరించిన విష‌యం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు