తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తాజా చిత్రం జైలర్ . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతుంది. తాజాగా జైలర్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. కేరళలో తలైవా సినిమా పంపిణీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. కేరళలో జైలర్ పంపిణీ హక్కులు రూ.5.5 కోట్లు పలికినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్.
శ్రీ గోకులం మూవీస్ జైలర్ చిత్రాన్ని కేరళలో విడుదల చేస్తోంది. కేరళలో తలైవా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ ఒక్క అప్‌డేట్‌తో అర్థం చేసుకోవచ్చు. జైలర్‌లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునీల్, తమన్నా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి కీ రోల్స్ లో నటిస్తున్నారు. ఇటీవలే జైలర్ షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జైలర్ ఆగస్టు 10న థియేటర్లలో సందడి చేయనుంది. జైలర్ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన మోహన్ లాల్, సునీల్, తమన్నా పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. టాప్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.