Wednesday, May 15, 2024

ఎన్నికలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు

తప్పక చదవండి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

జనగామ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు-2023, సజావుగా నిర్వహించడానికి జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అధ్యక్షతన ఎన్నికల నోడల్ అధికారులు, సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బంది, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కావలసిన శిక్షణా తరగతులు ఇప్పటికే విడుతల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు,
ఈ కార్యక్రమానికి వచ్చిన నోడల్ అధికారులకు మాస్టర్ ట్రేనర్స్ చే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) సియు, బియు, వి వి ప్యాట్లల నిర్వహణ,అవగాహన తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి పనిని జాగ్రత్తగా నిర్వహించాలని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆయన ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల వారీగా ఎన్నికల నోడల్ అధికారులు, ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకునేందుకు ప్రత్యేక అధికారులు ఎప్పటికీ అప్పుడు క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సహాయ అధికారిని సుహాసిని, ఎన్నికల నోడల్ అధికారులు ఇస్మాయిల్, వినోద్ కుమార్, రంగా చారి, అనిల్ కుమార్, మోగులప్ప, కొండల రెడ్డి, చంద్రశేఖర్, డాక్టర్ ప్రశాంత్, రాజేందర్ రెడ్డి, ఎఓ రవీందర్, తదితులున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు