Monday, May 6, 2024

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు దుస్తుల పంపిణీ

తప్పక చదవండి

మేడ్చల్ : నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కొంపల్లి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కె.సుమన్ అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రోటరీ క్లబ్, సేవ భారతి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు లేని చిన్నారులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పేట్ బషీరాబాద్ ఎస్ఐ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ వేముల రాములు హాజరై రోటరీ క్లబ్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సుమన్ మాట్లాడుతూ తాము సంపాదించిన దానితో తృప్తి చెందకుండా ప్రతిఒక్కరు తమ వంతుగా సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు. కుటుంబం పెద్దను కొల్పుయిన చిన్నారులను మా వంతుగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రెటరీ రాహుల్, సభ్యులు పరగ్ షా, ఆర్కె గుప్త, సురోష్, జనాథ్, జ్యోతి, శ్వేతా, రమేష్,సేవ భారతి ప్రముఖ్ బట్టికడి హనుమంతరావు, ముక్కిడిగాళ్ళ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు