Thursday, June 13, 2024

మంత్రి మల్లారెడ్డి పై ఛార్జ్ షీట్ వేయాలి

తప్పక చదవండి
  • అడ్డగోలుగా అఫిడవిట్లు దాఖలు చేసిన మంత్రి మల్లారెడ్డి..
  • డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్..

హైదరాబాద్ : 2014లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎంపీగా పోటీ చేసినప్పుడు మల్లారెడ్డి ఇచ్చిన తన అఫిడవిట్ లో సికింద్రాబాద్ ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీ నుంచి 1973లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడైనట్టు పేర్కొన్నారు. 2018 లో ఇచ్చిన అఫిడవిట్ లో సికింద్రాబాద్ లో ని వెస్లి జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్లుడైనట్టు పేర్కొన్నారు. తాజాగా 2023లో ఇచ్చిన అఫడవిట్ లో రాఘవ లక్ష్మిదేవి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు పేర్కొన్నారు.

దొంగ చదువులు. చూపించిన మంత్రి మల్లారెడ్డి కుటుంబ యాజమాన్యంలోని మల్లారెడ్డి విద్యాసంస్థల్లో అక్రమాలు గుర్తించామంటున్నారు ఐటీ అధికారులు. ఆయన విద్యాసంస్థల్లో అక్రమాలపై నిర్థారణకు వచ్చింది ఐటీ శాఖ.. ఈ విషయం ఇదివరకే తెలిపింది. నిర్దేశిత ఫీజుల కంటే అదనంగా వసూలు చేసినట్లు ఐటి నిర్ధారించింది. వసూలు చేసిన ఫీజులను, అనధికార వసూళ్లను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో బ్లాక్‌లో నగదును వుంచుతున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. నగదును నారాయణ ఆసుపత్రికి తరలించినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. వసూలు చేసిన మొత్తాన్ని మల్లారెడ్డి- నారాయణ ఆసుపత్రి నిర్మాణానికి వెచ్చించినట్లుగా ఆధారాలు సేకరించినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. అలాగే స్థిరాస్తులను కూడా అసలు విలువకు తగ్గించి చూపినట్లు వారు తెలిపారు. ఇదే సమయంలో మంత్రి మల్లారెడ్డి వియ్యంకుడు వర్థమాన్ కళాశాలలో డైరెక్టర్‌గా వుండటంతో అక్కడ కూడా సోదాలు నిర్వహించినట్లుగా ఎన్టీవీ తన కథనంలో తెలిపింది. మొత్తంగా మల్లారెడ్డి , ఆయన బంధువుల ఇళ్లు , కార్యాలయాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన ఆడియో కూడా బయటకు వచ్చింది. మల్లారెడ్డి యూనివర్శిటీ తప్పుడు పత్రాలతో అనుమతులు తీసుకున్నదే. మల్లారెడ్డి యూనివర్శిటీ ఉన్న గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలో 1965 పహానీలో సర్వే నెం 650లో 22 ఏకరాల 8 గుంటలు ఉన్నట్లు ఉంది , అదే విధంగా 2000-01 పహనీలో కూడా 22 ఎకరాల 8 గుంటలుగా ఉంది . అయితే ఆతరువాత ఏమి జరిగిందో ఏమో గానీ ధరణి పోర్టల్ లో 560 సర్వే నెంబర్ లో 33 ఎకరాల 20 గుంటలు అయ్యింది. అది ఎలా సాధ్యమైందో. ధరణి పోర్టల్ ద్వారా ఆ 33 ఎకరాల భూమి పది మంది పేరు మీద విభజన జరిగింది. ఇది ఏమైనా కేసిఆర్ ముక్కా రోజు రోజుకు పెరగడానికి, 22 ఎకరాల భూమి 33 ఎలా అయ్యింది. ఈ సర్వే నెంబర్ లో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఈ 16 ఎకరాల భూమికి శ్రీనివాసరెడ్డి ఎలా యజమాని అయ్యాడు..? ఈ భూమిని తరువాత శ్రీనివాసరెడ్డి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటికి గిఫ్ట్ డీడ్ చేయగా ఈ భూమి చూపించి మల్లారెడ్డి యూనవర్శిటీ అనుమతులు పొందింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ఇదే భూమిలో గ్రామ పంచాయతీ అనుమతితో 2004 సంవత్సరంలో లేఅవుట్ అనుమతులు తీసుకుని విక్రయాలు సాగించారనీ, ఆ తరువాత 2015లో హెచ్ఎండీఏ లే అవుట్ తీసుకుని విక్రయాలు సాగించారు.

అలాగే మరో పక్క మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నాక్ గుర్తింపు కోసం తప్పుడు దృవీకరణ పత్రాలు సమర్పించారన్న అభియోగంపై నాక్ అయిదేళ్ల పాటు నిషేదం విధించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాక్ మల్లారెడ్డి కళాశాల తప్పుడు (ఫోర్జరీ పత్రాలు) పత్రాలు సమర్పించింది.. అందుకు నాక్ గుర్తింపునకు అయిదేళ్లు నిషేదం విధిస్తే కేసిఆర్ సర్కార్ యూనివర్శిటీ అనుమతి ఇచ్చింది. ఇటువంటి నాయకుడిని పక్కన పెట్టుకుని కేసిఆర్, కేటిఆర్ లు నీతి గురించి, నిజాయతీ గురించి మాట్లాడుతున్నారని బక్క జడ్సన్ తీవ్ర విమర్శలు చేశారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు