Saturday, May 11, 2024

దర్జాగా చెరువు కబ్జా..

తప్పక చదవండి
  • ఇరిగేషన్ రెవిన్యూ మున్సిపల్ అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్న నిర్మాణాలు
  • అమీన్ పూర్ మున్సిపాలిటి వాణి నగర్ లో పెట్రేగి పోతున్న కబ్జాదారులు..
  • అవినీతి మత్తులో జోగుతున్న అధికారులు..
  • అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని వైనం..
  • ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్..
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్..

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణి నగర్ శివారు ప్రాంతంలో ఉన్న అమీన్ చెరువు పై కబ్జా దారుల కన్ను పడింది.. ఎన్నికల సమయంలో అధికారులకు తృణమో, ప్రణమో ముట్ట చెప్పి యథేచ్ఛగా చెరువును పూడ్చి కబ్జాకు తెర లేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి .. అధికారులకు ముడుపులు ఇవ్వకుండా చెరువులో అక్రమ నిర్మాణాలు చేసిన నిర్మాణాన్ని కూల్చివేసి అదే ప్రాంతంలో కబ్జాదారులు ముడుపులు ముట్టచెప్పిన వారు అక్రమ నిర్మాణాలు చేస్తున్న పట్టించుకోకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతోంది.. కాసులిస్తే కట్టుకోవచ్చు లేదంటే కూల్చివేస్తారా అనే ఆరోపణలు అధికారుల పై వెల్లు వెత్తుతున్నాయి..ఒక్కవైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పరిరక్షనకు చర్యలు చేపట్టిన,నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిన అమీన్ మండలంలోని రెవిన్యూ,మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు అట్టి ఆదేశాలను బేఖాతర్ చేస్తూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని అక్కడ చెరువులో నిర్మిస్తున్న నిర్మాణాలు చూస్తుంటే అట్టే అర్థమైపోతుంది..

గత ప్రభుత్వంలో చెరువులు అన్యాక్రాంతం అవుతున్న అధికారులు పట్టించుకోకపోవడం కబ్జా అరాచకాలు పెరిగిపోవడంతో అధికారులు తీరు పై స్థానిక ప్రజలు మండి పడుతున్నారు.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కబ్జాదారుల పై అధికారులు చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.. అమీన్ పూర్ వాణి నగర్ శివారు లో అమీన్ పుర చెరువులో నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి యథేచ్ఛగా చెరువులో నిర్మాణాలు అనే శీర్షిక ప్రచురించడం జరిగింది.. కబ్జాకు గురి అవుతున్న విషయం ఇరిగేషన్ అధికారి ఏఈ ప్రసాద్,మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పవన్,అమీన్ పూర్ మండల తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లిన నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..ఈ ప్రాంతంలో కబ్జాలు చేసిన అక్రమ నిర్మాణాలు చేపట్టిన అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే అస్సలు అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారా..? లేక యాది మరిచారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.. అన్యాక్రాంతం అవుతున్న చెరువు లో చేస్తున్న అక్రమ నిర్మాణాల పై,సంబంధిత అధికారుల వ్యవహార తీరుపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టి సారిస్తే తప్పా చెరువుల పరిరక్షణ అసాధ్యమేనంటూ పలువురూ సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. అమీన్ పూర్ మున్సిపాలిటీ లో జరుగుతున్న మరిన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతి పై అస్రం

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు