Friday, May 17, 2024

షాద్‌నగర్‌లో యథేచ్ఛగా అక్రమ మట్టి దందా..

తప్పక చదవండి
  • తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!
  • రైతులకు నామమాత్రం చెల్లిస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు

షాద్‌నగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): అక్రమార్కులు పట్టపగలే జోరుగా మట్టి అక్రమంగా తరలిస్తున్నారు.. తాజాగా ఫరూక్‌ నగర్‌ మండలం దేవుని బండ తండాకు చెందిన రూప్లా నాయక్‌ అనే రైతు పొలం నుంచి ఒక జెసిబి మూడు టిప్పర్లతో ( టిప్పర్‌ నెంబర్‌ ుూ 12 ఖణ 1697, ఖణ 7727) యదేచ్చగా మట్టిని తరలిస్తున్నారు అదేమని అడిగితే సొంత పొలంలో మూడు ఫీట్ల వరకు తవ్వుకునే అధికారం రైతుకుందని ఏ రెవెన్యూ అధికారుల వద్ద అనుమతి అవసరం లేదని అంటున్నారు ఇదే మట్టిని టిప్పర్ల ద్వారా షాద్నగర్‌ పట్టణంలోని పలు ప్రైవేట్‌ వ్యక్తులకు విక్రయిస్తున్నారు ఈ మట్టి విలువ బహిరంగ మార్కెట్లో ఒక టిప్పర్‌ ధర 4000 నుంచి 4500 రూపాయల వరకు పలుకుతుంది రైతులకు నామమాత్రపు డబ్బులు ముట్ట చెబుతూ అక్రమ మార్గంలో లక్షల్లో ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లో వేసుకుంటున్నారు .ఈ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోందని స్థానికులు అంటున్నారు. ఈ వ్యాపారం ఈ ఒక్క గ్రామంలోనే జరుగుతుందనుకుంటే పొరపాటు మండలంలోని గంట్లవెళ్లి,కమ్మదనం,చిలకమర్రి,సోలిపూర్‌, గ్రామాలతోపాటు షాద్‌ నగర్‌ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి అక్రమ దందా కొనసాగుతోంది రాత్రి అయిందంటే చాలు మట్టి మాఫియా నిద్ర లేస్తుంది కొండలను పిండి చేస్తూ కోట్ల రూపాయలని గడిస్తున్నారు అక్రమార్కులు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు