Friday, May 10, 2024

కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెంపు

తప్పక చదవండి
  • ఎన్నికలు ముగియడంతో వాతలు
  • స్వల్పంగా తగ్గిన పెట్రో,డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ : కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. ఐదు రాష్టాల్ర ఎన్నికలు ముగిశాయో లేదో అలా సిలిండర్‌ ధరల్లో మార్పు చోటు చేసుకుంది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. గత నెలలో కూడా కమర్షియల్‌ సిలిండర్ల ధరను రూ.103 పెంచారు. దీంతో ఢల్లీిలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1796.50కు చేరింది. ఇక హైదరాబాద్‌ లో రూ.2024.5గా ఉంది. అయితే 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం డొమెస్టిక్‌ సిలిండర్‌ రూ.918.50కి విక్రయిస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్‌ ధరను రూ.200 తగ్గించింది. కాగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున మారుస్తుంటారు. మరోవైపు ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 5పైసలు, 4పైసల చొప్పున తగ్గాయి. విజయవాడలో ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.87 గాను, లీటర్‌ డీజిల్‌ రూ.99.61 గా ఉంది. హైదరాబాద్‌ లో ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.66 గాను, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 97.82 గా ఉంది, నిన్న నమోదైన ధరలతో పోల్చితే ఇవాళ హైదరాబాద్‌ లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో ఎలాంటి తేడా లేదు. వాహన వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగింది. నవంబర్‌ 30తో పోలిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 5పైసలు, 4పైసల చొప్పున తగ్గాయి. విజయవాడలో ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.87 గాను, లీటర్‌ డీజిల్‌ రూ.99.61 గా ఉంది. హైదరాబాద్‌ సిటీలో ఈ రోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.66 గాను, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 97.82 గా ఉంది, నిన్న నమోదైన ధరలతో పోల్చితే ఇవాళ హైదరాబాద్‌ లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో ఎలాంటి తేడా లేదు. దేశ రాజధాని ఢల్లీిలో ఈ రోజు లీటరు పెట్రోల్‌ ధర రూ. 96.72 గాను, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 89.62 గా నమోదైంది, దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 106.31గాను, అలాగే డీజిల్‌ ధర లీటర్‌ రూ. 94.27గా నమోదు కాగా.. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో ఎలాంటి వ్యత్యాసం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు