Saturday, April 27, 2024

బేవరెజెస్‌ కార్పోరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి

తప్పక చదవండి
  • సీబీఐతో దర్యాప్తు చేయించాలని జనసేన డిమాండ్‌

విజయవాడ : ఏపీ బేవరెజెస్‌ కార్పోరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి అనకొండలా మారిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్‌ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. వంద కోట్లు అక్రమంగా దోచుకున్నారని… ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మండిపడ్డారు. ఆయన చేసిన అవినీతి, దోచుకున్న వందల కోట్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 2,934 మద్యం దుకాణాల్లో సెక్యూరిటీ గార్డులను నియమించాల్సి ఉండగా 1400 షాపులకు మాత్రమే నియమించారని తెలిపారు. ఈ నాలుగేళ్లుగా 1500 షాపులకు గార్డులను నియమించకండా రూ.80 కోట్లు ఓపీడీయస్‌ సెక్యూరిటీ ద్వారా దోచుకున్నారని ఆరోపించారు. 2934 మంది టెండర్లు పిలిచి 1400 మందికి మాత్రమే జీతాలు చెల్లించేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఓపీడీయస్‌ సెక్యూరిటీ సంస్థ ద్వారా జరిగిన వాసుదేవరెడ్డి అవినీతిపై విచారణ చేయాలని అన్నారు. ఓపీడీయస్‌ సంస్థ జీఎస్టీ ఎగ్గొట్టిన డబ్బు రూ.130 కోట్లు అని తెలిపారు. ఓపీడీయస్‌ సెక్యూరిటీనే నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించారని ఆయన అన్నారు. యేడాది బాలాజీ సెక్యూరిటీ సర్వీసెస్‌ అనే బినావిూ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారని.. 80 కోట్ల రూపాయులు అయాచితంగా వాసుదేవరెడ్డి లబ్ది పొందారని తెలిపారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో మ్యాన్‌ పవర్‌ కూడా వాసుదేవరెడ్డి సప్లై చేస్తారని తెలిపారు. బ్లాక్‌ లిస్టులో పెట్టాల్సిన సంస్థకు టెండర్‌ ఎలా ఇచ్చారని నిలదీశారు. ప్రతి వైన్‌ షాపులో అట్టపెªటటెలు అమ్మే కాంట్రాక్టు వేరే వాళ్లకి అప్పగించి రూ.20కోట్లు కొట్టేశారన్నారు. వాసుదేవరెడ్డి బినావిూ సంస్థ రెడ్డీస్‌ యన్‌ రెడ్డీస్‌కే ఇచ్చి.. దోచుకున్నారన్నారు. రోడ్ల విూద చెత్త ఎత్తుకుంటేనే కేజీ ఎనిమిది రూపాయలకు కొంటారని.. వాసుదేవరెడ్డి మాత్రం అట్టపెªటటెలను కిలో 2.25 రూపాయలుకే కాంట్రాక్టు ఇచ్చారని.. దీని వల్ల ఒక్కో జిల్లా నుంచి యేడాదికి రూ.20 లక్షలు ఇచ్చేలా వాసుదేవరెడ్డి ఒప్పందం చేసుకున్నారని వెల్లడిరచారు. ఈ నాలుగేళ్లల్లో మొత్తం వంద కోట్లు వాసుదేవరెడ్డి దోచుకున్నారని మండిపడ్డారు. వాసుదేవరెడ్డి అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. తమ పార్టీ పెద్దలతో చర్చించి దీనిపై త్వరలోనే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని పోతిన వెంకట మహేష్‌ ప్రకటించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు