Friday, May 17, 2024

ఓట్ల కోసం దళితులను ఆగం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి

తప్పక చదవండి
  • తీవ్ర విమర్శలు చేసిన ఎంపీపీ వైయస్సార్..
  • దళిత ముఖ్యమంత్రి ఎటుపాయే
  • దళితులకు మూడెకరాలు ఎటుపాయే
  • దళిత బంధు ఎటుపాయే
  • ఈ హామీలు నెరవేర్చకుండా దళితుల భూమి లాక్కోవాలని చూస్తున్నారు
  • రెక్కాడితేనే డొక్కాడని పేద ప్రజల భూములు ఎలా లాక్కుంటారు..?
  • పేద ప్రజల భూములతో వ్యాపారం చేయొద్దు..

మేడ్చల్ మల్కాజ్ గిరి : మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండల్, నూతనకల్ గ్రామంలో 472 సర్వేనెంబర్ భూమిని ఏడో తారీఖు నాడు అసెంబ్లీలో మైనారిటీల స్మశాన వాటికకు కేటాయించడాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు నూతనకల్ గ్రామ భూమి బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో స్మశాన వాటిక భూమిని కేటాయించగానే అధికారులు ఆగమేఘాలమీద అని పనులు పూర్తి చేశారని.. 472 సర్వే నంబర్ భూమి పూర్తిగా దళితులకు సంబంధించిందని, 70 కుటుంబాలకు సంబంధించిన భూమి ఒక్కో కుటుంబానికి 1/2 ఎకరం నుంచి ఎకరం భూమి ఉందని, వారు దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ భూమిపైనే సాగు చేసుకుని బ్రతుకుతున్నారని, భూమికి రైతుబంధు కూడా వస్తుందని, కానీ స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకే ఈ భూమిని మైనారిటీ స్మశాన వాటికకు అప్పగించారని, ఈ భూమిపై వందల సంవత్సరాలకు సంబంధించిన పురాతనమైన ఆలయాలు ఉన్నాయని, ఇవన్నీ మర్చిపోయి మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజల మీద ప్రేమ ఉంటే సిటీలో 100 ఎకరాల భూమి ఉందని. ఒక ఎకరం 100 కోట్లకు అమ్ముకోకుండా ఆ భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. రేక్కాడితేనే డొక్కాడని పేద ప్రజల భూములు ఇలా లాక్కుంటారా అని భూములపై వ్యాపారం చేయొద్దని, మీరు ఏం అభివృద్ధి చేశారు..? ప్రజలకే తెలుసని, ఈ అవినీతిని త్వరలో ప్రజలు కూడా గుర్తిస్తారని, త్వరలోనే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని, ఇచ్చిన హామీలు మర్చిపోయి దళితుల భూములను ఎలా గుంజుకుంటారని దీని పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు.. త్వరలోనే పరిష్కారం చేయకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన ఉదృతం చేస్తారని మీడియా ద్వారా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో స్థానిక మేడ్చల్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి ప్రేమ్ దాస్, నాయకులు రాఘవరెడ్డి, సీనియర్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు