Tuesday, June 25, 2024

కళ్ళుండి చూడలేని కబోది కల్వకుంట్ల కవిత..

తప్పక చదవండి
  • టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి..
    హైదరాబాద్ : నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి లిక్కర్ దందా మత్తులో కళ్ళు కనబడటం లేదని మణిపూర్ లో మహిళపై జరిగిన ఘటనపై మాట్లాడకుండా రాహుల్ గాంధీపై వ్యంగంగా మాట్లాడడం హాస్యాస్పదమని, మైనార్టీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని,12 శాతం ఇస్తా అన్న రిజర్వేషన్ ఇంతవరకు ఇయ్యకుండా మైనార్టీలను మభ్యపెడుతున్న నీ అయ్య కేసీఆర్ ను ప్రశ్నించకుండా.. నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ను ప్రశ్నించడం, విమర్శించడం సిగ్గుచేటు.. ఇప్పటికైనా డ్రామాలు పక్కకు పెట్టి ప్రజల గురించి ఆలోచించాలి.. లిక్కర్ దందా నుండి ఎస్కేప్ చేసిన మోడీ అంకుల్ కి కృతజ్ఞతలు తెలపడంలో విజయవంతమైన కవిత, ఎలాగో మైనార్టీ ఓట్లు బిజెపికి పడవని బీఆర్ఎస్ వైపు మళ్ళించుకోవాలని చూస్తున్న మీకు మైనార్టీలు రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్తారని టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు