Sunday, April 28, 2024

ఈ సారి గెలుపు మాదే .. ..!

తప్పక చదవండి
  • కేసీఆర్ పై వ్యతిరేకత ఉందన్నది అవాస్తవం
  • బీఆర్ఎస్ పార్టీపై అసత్యపు ప్రచారాలు
  • చేవెళ్ల సీటును కేటాయించడం పట్ల హ‌ర్షాతిరేక‌లు
  • బేషరతుగా మద్దత్తు ఇస్తున్న కుల సంఘాలు
  • తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేదు
  • బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
  • గెలుపు ఖాయం అంటున్న కాసాని జ్ఞానేశ్వర్

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం చేవెళ్ల సీటును కేటాయించడం పట్ల ఆయన కేసీఆర్, కేటీఆర్, హరీష్ లకు కృతఙ్ఞతలు తెలియ జేశారు.. 40 ఏండ్లకు పైగా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ లేకుండా ఉన్నానని కాసాని తెలిపారు.. ప్రజలతో ఎప్పుడు సత్సంబంధాలు కొనసాగిస్తుంటానని … ప్రజల ఆధరాభిమానాలు తనకు ఎప్పుడు అండగా ఉంటాయని కాసాని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ పై బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందని కొంత మంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అవన్నీ పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ అధిష్టానం చేవెళ్ల పార్లమెంట్ టికెట్ విషయంలో ఇటీవల క్లారీటీ ఇవ్వడంతో పలు నియోజక వర్గాల నుంచి పలువురు కుల సంఘాల నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు బేషరతుగా మద్దత్తు ఇస్తామని చెబుతున్నారని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. తమ ప్రాంతాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్య అతిధిగా హాజరు కావాలని కోరుతున్నారని కాసాని వివరించారు.. ..

బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో చేవెళ్ల ఒక్కటి
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 25 లక్షల మంది కి పైగా ఓటర్లున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో కొనసాగుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో పాగా వేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలు.. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఇటీవల వెలువడిన పలు సర్వేల్లో బీఆర్ఎస్ గెలిచే స్థానాల్లో చేవెళ్ల ఒక్కటిగా చెబుతున్నారు..

- Advertisement -

ఇక్కడ ట్రై యాంగిల్ పోటీ ఉండనుంది
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్, నాలుగు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. హైదరాబాద్ శివారులోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టిపోటి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ట్రై యాంగిల్ పైట్ ఉండనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీచేస్తారని తొలుత భావించినప్పటికీ అనుహ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం తెరమీదకు తీసుకు వచ్చింది. బీసీ కమ్యూనీటిలో బలమైన నేత కావడంతో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీజేపీ, కాంగ్రెస్ లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్‎లో బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు