Tuesday, May 21, 2024

నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీర వనిత ‘చాకలి ఐలమ్మ’..

తప్పక చదవండి
  • ఐలమ్మ ఆశయాల స్పూర్తితో ముందుకు సాగుదాం…
  • బహుజనులు చట్టసభల్లో ఉంటేనే సబ్బండ వర్గాలకు సంపూర్ణ న్యాయం..
  • చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు..
  • చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుచేసి ఏడాది పూర్తి అయ్యింది..
  • స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ
    పక్షోత్సవాల్లో నీలం మధు ముదిరాజ్..

హైదరాబాద్ : పుట్టింది ఒక బహుజన కుటుంబంలో.. కానీ ఆమె వ్యక్తిత్వం, ధైర్యం, సాహసం మాత్రం బహుపార్శ్వాలుగా ఉంటుంది.. సబ్బండ వర్గాలకు సంపూర్ణ న్యాయం జరగాలనే ఉన్నతాశయంతో ఆమె జీవన ప్రయాణం కొనసాగింది.. నిరంకుశత్వాన్ని ఎదిరించి మహిళా మణుల్లో మరుపురాని చరిత్రకు నిలువెత్తు ఆదర్శంగా నిలిచింది.. ఆమె చాకలి ఐలమ్మ.. ధైర్యం, సాహసం, సమాజసేవలు ఆమెకు పుట్టుకతోనే వచ్చిన ఆభరణాలు.. ఎంత స్మరించుకున్నా ఆమె ఋణం తీర్చుకోలేము.. కేవలం ఆమె ఆశయాలను బ్రతికించడానికి ప్రయత్నం చేసినప్పుడే ఆమెకు మనం అందించే ఘన నివాళి అవుతుంది..

చాకలి ఐలమ్మ 128వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని చిట్కుల్ లోని ఐలమ్మ కాంస్య విగ్రహం వద్ద నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని నీలం మధు ముదిరాజ్ అన్నారు.. ఈ సంధర్బంగా చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నీలం మధు ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. నిజాం రజాకార్ల నిరంకుశ పాలనలో వెట్టి చాకిరితో మగ్గిపోయిన బతుకులను బాగు చేయడానికి, బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందూకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆనాడు ఆమె చేపట్టిన ఉద్యమం అణచివేతను ప్రశ్నించేలా ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చిందన్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో రాష్ట్రంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని గత సంవత్సరం చిట్కుల్ గ్రామంలో ప్రతిష్టించామని ఆయన గుర్తు చేశారు. అదే ఐలమ్మ పోరాట పటిమ, ధైర్యాన్ని స్ఫూర్తిగా చేసుకుని తాను సైతం ముందుకు వెళ్తున్నానని తెలిపారు. బహుజనులు చట్ట సభల్లో వెళ్తేనే మన వర్గాలకు సమన్యాయం దొరుకుతుందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసమే తాను ఎల్లప్పుడూ కృషి చేస్తూ స్వచ్చంధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని వెల్లడించారు. అన్ని సబ్బండ వర్గాల ప్రజల ఆశీర్వాదంతో అందరితో చర్చించి త్వరలో తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్తూవారి ఆధారభిమానాలతో మరింత సేవ చేస్తానని పునరుద్గటించారు, ఈ కార్యక్రమంలో ఈఓ కవిత, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, భుజంగం, వెంకటేశ్, రాజ్ కుమార్, యాదగిరి, ఆంజనేయులు, మాజీ పీ.ఏ.సి.ఎస్. చైర్మన్ నారాయణ రెడ్డి, మన రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి చాకలి వెంకటేష్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్, గౌరీ శంకర్, అనిల్, సంఘం సభ్యులు సత్తయ్య, అర్జున్, బాబు, శేఖర్, కిషోర్, గోపి, గ్రామ పెద్దలు, ఎన్.ఎం.ఆర్. యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు