Sunday, May 19, 2024

దసరా బోనస్

తప్పక చదవండి
  • సింగరేణి కార్మికులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు..
  • లాభాల్లో 32 శాతం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం..
  • 2022-23 లాభాల్లో వాటా చెల్లించేందుకు ఆదేశాలు..
  • రూ.700 కోట్లను దసరాకు ముందుగానే చెల్లింపు..
  • ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కారు..

హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంస్థ లాభాల్లో ఉద్యోగులకు వాటా ఇవ్వాలని నిర్ణయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను లాభాల్లో ఉద్యోగులకు 32 శాతం వాటా ఇవ్వాలని తీర్మానం చేసింది.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32 శాతం వాటా చెల్లించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డుస్థాయి లాభాలను ఆర్జించింది. ఇందులో రూ.700 కోట్లకు పైగా లాభాలను కార్మికులకు దసరా ముందస్తుగా చెల్లించనున్నట్లు కేసీఆర్‌ కొన్నిరోజుల క్రితం చెప్పారు. ఈ నేపథ్యంలోనే… ఇచ్చిన హామీ మేరకు గతంలో 30 శాతానికి మించి కార్మికులకు రూ.700 కోట్లకు పైగా లాభాల్లో వాటా వచ్చేలా 32 శాతం అంటే.. రూ.711 కోట్లు చెల్లించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవలే కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 23 నెలల బకాయిలు దాదాపు రూ.1,450 కోట్లను ప్రభుత్వం చెల్లించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 23న దసరా పండుగ ఉండడంతో.. అందుకు ముందుగానే లాభాల్లో వాటాను చెల్లించేలా సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తుండటంతో కార్మికులు ఉద్యోగులు పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు