Wednesday, May 15, 2024

విలువలతో కూడిన విద్యాలక్ష్యాలు నెరవేరేనా!

తప్పక చదవండి

విలువలు లేని విద్య సువాసన లేని మల్లె లాంటిది. విలువలే వ్యక్తిత్వ వికాస వెలుగులు. విద్యతో బుద్ది తోడవ్వాలి. చదువుతో సంస్కారం జత కట్టాలి. ఎన్ని యూనివర్సిటీల పట్టాలు చేతులో ఉన్నప్పటికీ సంస్కార విలువలు తోడవకపోతే ఆ డిగ్రీలు నిరర్థకం. చదువులేక పోయినా సంస్కారంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఉన్నత చదువులు ఉండి కూడా విలువలు కొరవడితే తగిన గుర్తిం పు, గౌరవం దక్కవు. వ్యక్తులకు మానవీయ విలువలే శాశ్వత ఆకర్షణీయ ఆభరణాలు అవుతాయి. నేటి విద్యా విధానంలో ర్యాం కులకు ఇచ్చిన ప్రాధాన్యం విలువలు నేర్పడానికి ఇవ్వకపోవ డం సోచనీయం. విద్యతో బుద్ది, చదువుతో సంస్కారాలను నేర్పించే పాఠ్య ప్రణాళికలు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
విలువలతో కూడిన విద్యలో ముఖ్య భాగాలు: ఈ నేపథ్యాన్ని దృష్టి లో పెట్టుకొని విలువలతో కూడిన విద్యలో ముఖ్య భాగాలుగా ఆశావహ దృక్పథాన్ని పెంపొందించడం, సమాజంతో సమన్వయ భావనలతో మమేకం కావడం, జీవితానికి సరైన లక్ష్యాలను నిర్ణ యించుకోవడం, నిలకడగా ఎదగడం, సక్రమమైన ఆలోచనా విధానాలను అలవర్చుకోవడం, విలువలతో కూడిన మానవ సం బంధాలను నిర్మించుకోవడం, సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకోవడం, ఆధునిక సమాజ పోల్‌ను అర్థం చేసుకుంటూ ముం దడుగు వేయడం లాంటి అంశాలను గుర్తించారు. విలువలతో కూడిన విద్యలో వ్యక్తిత్వ వికాసం, నైతిక అభివృద్ధి, మతపరమైన విద్య, ఆధ్యాత్మిక అభివృద్ధి, పౌరల కనీస భాద్యతలు, గుణ సంప న్నతలు, సామాజిక అభివృద్ధి, సాంస్కృతిక వికాసం లాంటి పాఠ్యా ంశాలు ఉండాలి. మనం బోధించే విద్యలో భాద్యతాయుత సమన్వ య పౌరసత్వం, నైపుణ్య – వృత్తిపరమైన శిక్షణ, ప్రజా స్వామ్యబద్ద సదాలోచనలు, జాతీయ సమైక్యత పెంపొందించే బోధనలు, సమాజ భిన్నత్వాన్ని స్వీకరించడం, వ్యక్తిగత గౌరవాన్ని కాపాడడం లాంటి అంశాలు పాఠ్యాంశాల్లో బోధించేలా జాగ్రత్త పడాలి. జాతీయ పాఠశాల విద్య ప్రణాళిక-2023: జాతీయ పాఠశాల విద్య పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ -2023 (నేషనల్‌ కర్రికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఫర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌-2023) నిర్ణయం ప్రకారం పాఠశాల విద్యా బోధనలో ఐదు లక్ష్యాలను పేర్కొన్నారు. హేతుబద్దమైన స్వతంత్ర ఆలోచనలు, ఆరోగ్యంతో కూడిన క్షేమం, ప్రజాస్వామ్య సమాజ భాగస్వామ్యం, ఆర్థిక భాగస్వామ్యం, సాంస్కృతిక భాగస్వామ్యం అనబడే లక్ష్యాలను నిర్ణయించారు. ఈ లక్ష్యాల ద్వారా విజ్ఞానం, సామర్థ్యం, విలువలు, స్వభావాలు లాంటివి విద్యార్థుల్లో అభివృద్ధి చెందేందుకు దోహదపడతాయి. సహానుభూతి, సున్నితత్వం, నైతిక ప్రవర్తన, ఆత్మవిశ్వాసం లాంటి నైతిక విలువలతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, వైవిధ్య భరిత సమా జాన్ని అక్కున చేర్చుకోవడం, సోదరభావాన్ని పెంపొందించ డం, సామాజిక భాద్యతలను భుజాన వేసుకోవడం లాంటి ప్రజాస్వామ్య విలువలు కూడా విద్యార్థుల్లో అలవడేందుకు నూతన పాఠ్య ప్రణా ళికలు ఉపకరిస్తాయి. వీటికి తోడుగా జ్ఞానం-సత్యం, శాస్త్రీయ దృక్పథం లాంటి అంశాలు కూడా పాఠాలుగాబోధించబడతాయి.
విలువలు బోధించని విద్య అనర్థదాయకం: మానవీయ విలువల ను అనుభవపూర్వకంగా, విభిన్న పరిస్థితులను పరిశీలించుట ద్వారా నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సహకార ధోరిణి, సోదరభావాలు అనబడే ఆదర్శాలను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, ప్రధానో పాధ్యాయుల సమన్వయంతో సాధించారని నిర్థేషించబడిరది. పాఠశాల సంప్రదాయాలు, వాతావరణం, తరగతి గది ప్రక్రియలు కూడా విలువలను అందించడంలో దోహదపడతాయని మరువ రాదు. తరుచుగా పలు అంశాలపై ప్రజాస్వామ్యయుత చర్చలతో హేతుబద్దమైన ఆలోచనలు, సున్నితత్వ స్వభావాలు పెరుగుతాయి. పాఠశాల ప్రాంగణాల్లో క్రీడలతో పట్టుదల, నిజాయితీ, ఓటమిని అంగీక రించడం, గెలుపును ఆస్వాదించడం, ఓర్పు-సహనం, ధైర్యం, క్రీడాస్ఫూర్తి లాంటివి అలవడతా యని మరువరాదు. సాంఫీుక శాస్త్రం, వైజ్ఞానికశాస్త్రం, గణితశాస్త్ర చదువులతో జ్ఞాన సంబంధ విలువలు పెరుగుతాయి. సామాజికశాస్త్ర అధ్యయనంతో హక్కులు, భాద్యతలు, భాష, సహానుభూతి లాంటి విలువలు అలవడతాయి. ఉపాధ్యా యులు, పాఠశాల విద్యా కమిటీలు, ప్రధానోపాధ్యాయులు, తల్లితండ్రులు, పౌర సమాజం పాటించే విలువలుడనే విద్యార్థులు ప్రత్యక్షంగా, పరోక్షంగా నేర్చుకుంటారని మరువరాదు. విలువలతో కూడిన విద్య జాతి ప్రశాంత జీవన విధానాలకు పునాదులుగా పని చేస్తుంది. విలువలు కొరవడిన డిగ్రీలు కాగితాలు మాత్రమే. అంతర్‌సౌందర్యాన్ని పెంపొందించే విద్య మాత్రమే సుఖ సంతోషాల సమాజ నిర్మాణానికి దోహదపడు తుంది. కత్తికి, కలానికి ఉన్న పదునును అర్థం చేసుకునే విలువలతో కూడిన విద్య తక్షణావసరం అని నిపుణులు వివరిస్తున్నారు. సంపద సుఖాన్ని ఇస్తే, విలువలతో జీవన విధానం ఆనందాన్ని అందిస్తుంది. నేటి డిజిటల్‌ యుగంలో పెరుగుతున్న శాస్త్రసాంకేతిక విద్యతో పాటు విలువలను జోడిస్తేనే ప్రపంచ మానవాళి సుఖసణతోషాల కోవెలలో జీవించగలుగుతుంది. మన నూతన విద్యా విధానం-2020, జాతీయ పాఠశాల విద్యా ప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌-2023 వేదికలుగా రేపటి సమాజ నిర్మాణంలో నేటి చిన్నారులకు విలువలతో కూడిన విద్యను అందించే కృషిలో మనందరం భాగస్వామ్యం తీసుకుందాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు