Monday, April 29, 2024

హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్..

తప్పక చదవండి
  • హైదరాబాద్, బెంగుళూరు, ముంబై నగరాల కనెక్టివిటీ..
  • జాతీయ రైలు ప్రణాళిక సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వం..
  • సమర్థవంతమైన రవాణా కొత్త శకానికి నాంది..

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణా రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు రైల్వేలో వందే భారత్ రైళ్లను సైతం ప్రవేశపెట్టింది. ఈ వందేభారత్ రైళ్లను త్వరంలో మూడు వెర్షన్లలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇదే క్రమంలో భారత్ కలల ప్రాజెక్ట్ బుల్లెట్ రైళ్లను కూడా పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచించింది. దీనికి జాతీయ రైలు ప్రాణాళిక కూడా పలు సూచనలు చేస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌కు సైతం బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది.. హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాల కనెక్టవిటీతో బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ అభివృద్ధికి ముంబై-హైదరాబాద్‌తో సహా ఏడు సంభావ్య మార్గాలను జాతీయ రైలు ప్రణాళిక (ఎన్‌ఆర్‌పి) సూచనలు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఎన్.ఆర్.పీ. ముంబై – హైదరాబాద్ మధ్య 709 కి.మీ విస్తరించి ఉన్న బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌ను సూచనలు చేసింది. దీనిని 2051 నాటికి పూర్తి చేయడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. దీనికి సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి ఇప్పటికే ప్రాథమిక సన్నాహాలు జరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య అతుకులు లేని కనెక్టివిటీ కోసం భవిష్యత్తులో ఊహించిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, ఈ ప్రముఖ వాణిజ్య నగరాల మధ్య బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ఈ ప్రతిపాదన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సాధ్యాసాధ్యాల అధ్యయనం భూ పరీక్ష, ఆస్తి, భూ సేకరణ అవసరాలతో సహా పలు అంశాలను కలిగి ఉంటుంది. వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక తయారీ తర్వాత దీని గురించి మరింత క్లారిటీ వస్తుందని ఇండియన్ రైల్వేస్ లోని ఓ అధికారి తెలిపారు.

ఎన్లో.ఆర్.పీ. ని హై-స్పీడ్ రైలు మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 2041 నాటికి హైదరాబాద్ – బెంగళూరుకు బుల్లెట్ రైలు కనెక్టివిటీని పొందుతుందని అంచనా వేశారు. అయితే చెన్నై నుంచి మైసూరు మీదుగా బెంగళూరును కలిపే నెట్‌వర్క్ 2051 కోసం పరిశీలనలో ఉంది. ఈ చొరవతో పాటు, ప్రభుత్వం ప్రస్తుతం జపాన్ ప్రభుత్వం నుంచి సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక సహకారంతో ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టును చేపట్టింది. హై-స్పీడ్ రైలు కారిడార్‌లో గుర్తించిన ఏడు రైలు నెట్‌వర్క్‌లు ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృతసర్, ముంబై-నాగ్‌పూర్, చెన్నై-మైసూరు, వారణాసి-హౌరా వంటి ముఖ్యమైన మార్గాలను కలిగి ఉన్నాయి. హై-స్పీడ్ రైలు కారిడార్‌ల అభివృద్ధి దేశంలో ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. ఇది వేగవంతమైన, సమర్థవంతమైన రవాణా కొత్త శకానికి నాంది పలకనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు