- ఏ ఎస్సై సహా మరో ముగ్గురు మృతి..
- కాల్పులు జరిపిన ఆర్.పీ.ఎఫ్. కానిస్టేబుల్ చేతన్..
- నిందితున్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
- పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది..
జైపూర్ ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏం జరిగిందో ఏమో కానీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ చేతన్ పాల్ఘర్ స్టేషన్ దాటిన అనంతరం రైలు వెళుతుండగానే ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలోఆర్పీఎఫ్ ఏఎస్సై సహా మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఉదయం 5 గంటల సమయంలో బీ5 కోచ్‌లో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అంతా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కాల్పుల మోత వినిపించడంతో ప్రయాణి కులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని రైల్వే అధికారులకు అందించారు. అయితే చేతన్.. దహిసర్ రైల్వే స్టేషన్ సవిూపంలో రైలు నుంచి దూకేశాడు. పోలీసులు చాకచక్యంగా చేతన్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.