Saturday, May 18, 2024

ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకునే వారి దిమ్మ తిరగాలి.

తప్పక చదవండి
  • హేళన చేసేవారికి ఓటుతోనే బుద్ది చెప్పాలి..
  • ఎన్ని బెదిరింపులకు పాల్పడితే అన్ని ఓట్లు పెరుగుతయి..
  • 70 ఏండ్ల నల్లగొండ నియోజక వర్గ రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది.
  • తీవ్ర వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ అసమ్మతినేత పిల్లి రామరాజు యాదవ్..

హైదరాబాద్ : నవంబర్ 30 న జరుగబోవు ఎన్నికల కోసం సంసిద్ధులు కావాలని తిప్పర్తి, మాడుగులపల్లి మండలం ముఖ్య కార్యకర్తలకు, బిఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ దిశా నిర్దేశం చేశారు. బుధవారం తిప్పర్తి, మాడుగుల పల్లి మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో తిప్పర్తి, మాడుగుల పల్లి మండలానికి సంబంధించిన వివిధ బూతులకు సంబంధించిన 2000 మంది ముఖ్య కార్యకర్తలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బిఆర్ఎస్ అసమ్మతి నేతలైన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తనను అనేక రకాలుగా హేళన చేస్తున్నారని.. వారికి ఓటుతోనే బుద్ది చెప్పాలన్నారు. 70 ఏళ్లుగా నల్లగొండ నియోజక వర్గాన్ని ఒకే సామాజిక వర్గం తమ గుప్పిట్లో పెట్టుకుందని, నూతన సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారన్నారు.

నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం మారబోతుంది అన్నారు. బెదిరింపులకు భయపడేది లేదని వారన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకునే వారికి దిమ్మదిరగాలన్నారు. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆగడాలు ఎక్కువయ్యాయని, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలలో ఏ ఒక్క గ్రామానికి బి.టి. రోడ్డు వేయలేదన్నారు. ఒక్క నల్లగొండ కేంద్రంలో రోడ్డు వెడల్పు చేసి, ఇదే అభివృద్ధి అనడం సమంజసమా అన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి ఈ ఎమ్మెల్యే కు తేడా తెలువదన్నారు. పిల్లి రామరాజు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతాడు అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో బిఆర్.ఎస్. వారు, కాంగ్రెస్ పార్టి వారు ప్రలోభాలకు గురి చేసే ప్రమాదం ఉంటుందన్నారు. ముఖ్య కార్యకర్తలంతా సమన్వయంతో సర్దుబాటు చేసుకొని, ఓట్లను రాబట్టుకోవడానికి అందరూ నిర్విరామంగా కృషి చేయాలని అన్నారు. త్వరలోనే మన గుర్తును మీ ముందుకు తీసుకు వస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలకు సంబంధించిన వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల బాధ్యులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు