Monday, May 6, 2024

బీజేపీని ఇరకాటంలో నెట్టడానికి బీఆర్‌ఎస్‌ కుట్రలు

తప్పక చదవండి
  • కేసీఆర్‌కి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు
  • ట్రిపుల్‌ఆర్‌కు భూ సేకరణ చేయని రాష్ట్ర ప్రభుత్వం
  • రాష్ట్రనికిచ్చిన కేంద్రం నిధులపై బహిరంగ చర్చకు కేసీఆర్‌ సిద్ధమా?
  • కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సవాల్‌
  • నాకు కేసీఆర్‌, కేటీఆర్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు

హైదరాబాద్‌ : నాకు కేసీఆర్‌, కేటీఆర్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. ట్రిపుల్‌ ఆర్‌ తీసుకువచ్చాను.. కనీసం భూ సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు.. ప్రధాన మంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కనీసం సీఎం కేసీఆర్‌ రావడం లేదు.. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా?.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఇరకాటంలో నెట్టడానికి బీఆర్‌ఎస్‌ నేతలు కుట్రలు చేస్తున్నారు.. పసుపు బోర్డ్‌ పై వెయిట్‌ అండ్‌ సీ.. దున్నపోతుకు గడ్డి వేసి.. ఆవుకు పాలు ఇవ్వమంటే ఎలా ఇస్తుంది.. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ కేసీఆర్‌ కి తెలంగాణ ప్రజలపై లేదు.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో గన్‌ పార్క్‌ దగ్గర కేసీఆర్‌ తో బహిరంగ చర్చకు సిద్దం అని కిషన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఇక, అక్టోబర్‌ 1న ప్రధాని మోడీ 13,545 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. జక్లేర్‌ టు కృష్ణా కొత్త రైల్వే లైన్‌ ప్రజలకు అంకితం చేయనున్నారు. దీని ద్వారా గోవా నుంచి హైదరాబాద్‌ 120 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.. కాచిగూడ-రాయచూర్‌ డెమో సర్వీస్‌ ప్రారంభం కానుంది.. 6,404 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు. రూ. 2,661 కోట్ల వ్యయంతో నిర్మించిన హసన్‌-చర్లపల్లి హెచ్పీసీఎల్‌ పైప్‌ లైన్‌ ను ప్రజలకు మోడీ అంకితం చేస్తారు అని కిషన్‌ రెడ్డి అన్నారు. 13 లక్షలమంది ఎల్పీజీ కనెక్షన్లు పొందే కెపాసిటీ.. తెలంగాణలో 230 కిలోమీటర్ల మేర పైప్‌ లైన్‌ ఉంటే 130కి.మీ మేర పాలమూరు జిల్లాలోనే ఉంది.. ,932 కోట్లతో తెలంగాణ-నెల్లూరు కృష్ణపట్నం మధ్య మల్టీ ప్రొడక్ట్‌ పైప్‌ లైన్‌ నిర్మాణం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని ల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, ల్‌ ఆఫ్‌ మాథమెటిక్స్‌, స్కూల్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌, స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ భవనాలను మహబూబ్‌ నగర్‌ నుంచి వర్చువల్‌ గా ప్రధాని మోడీ ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక, మరో వైపు వచ్చే నెల 3న నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా 8,021 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం, శంఖుస్థాపనలు చేయనున్నారు అని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఎన్టీపీసీ ప్రాజెక్ట్‌ మొదటి దశలో 800మెగావాట్ల ప్రాజెక్టును అంకితం చేస్తారు.. 680 మెగావాట్లు తెలంగాణ అవసరాలకే ఉపయోగించడం జరుగుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు