Saturday, May 4, 2024

తెలంగాణ గ్రామీణ బ్యాంకులో బతుకమ్మ వేడుకలు..

తప్పక చదవండి
  • వివరాలు తెలిపిన బ్యాంకు మేనేజర్ ఎం.వీ.పీ రాజకుమార్.

హస్తినాపురం : శుక్రవారం రోజున తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. బ్యాంకు మహిళా సిబ్బంది, ఖాతాదారులతో కలిసి నిర్వహించారు. బ్యాంకు మేనేజర్ రాజకుమార్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఖాతాదారులతో కలిసి బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళా సోదరీమణులకు, ఖాతాదారులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ సి. దివ్య తేజ ,ఫీల్డ్ ఆఫీసర్ టి. రవికుమార్ , ఖాతాదారులుపాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు