Wednesday, February 28, 2024

ఆప్‌ ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ కుట్ర

తప్పక చదవండి
  • ఒక్కో ఎమ్మెల్యేకు 25కోట్ల ఆఫర్‌
  • ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ : తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నిందని ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజీవ్రాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూల్చేందుకు ఇటీవలె కొందరు బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేలను సంప్రదించారని చెప్పారు. 21 మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని ఆరోపించారు. తాను ఈ విషయం పై ఏడుగురితో మాట్లాడానని వారంతా తిరస్కరించామని చెప్పారని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత కేజీవ్రాల్‌ను అరెస్టు చేస్తామని తమ ఎమ్మెల్యేలతో వారు చెప్పినట్టు తెలిసిందని కేజీవ్రాల్‌ అన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలపై విరుచుకు పడతామని బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారని ఇందుకు ఒప్పుకుంటే 25 కోట్లు ఇచ్చి ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయిస్తామని ఆప్‌ ఎమ్మెల్యేలతో చెప్పారని కేజీవ్రాల్‌ అన్నారు. మద్యం కుంభకోణంపైనా దర్యాప్తు చేసేందుకు తనను అరెస్టు చేయడం లేదని కేవలం ప్రభుత్వాన్ని కూల్చేందుకు తనని అరెస్టు చేస్తున్నారని కేజ్రివాల్‌ అన్నారు. గత తొమ్మిదేళ్లలో ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు పన్నారని ఆరోపించారు. కానీ అవి ఏ మాత్రం విజయం సాధించలేదని తెలిపారు. దేవుడు, ప్రజలు ఎల్లప్పుడూ తమకు మద్దతు ఇచ్చారని అన్నారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ ని అమితంగా ప్రేమిస్తారని చెప్పారు. తమ ఎమ్మెల్యేలంతా కలిసి ఉన్నారని ఆప్‌ చీఫ్‌ తెలిపారు. ఆప్‌కు చెందిన మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు కేజీవ్రాల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ’21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిగాయి. ఇతర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా మాతో రావొచ్చు. రూ.25 కోట్లు ఇస్తాం ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయండి’ అంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని కేజీవ్రాల్‌ ఆరోపించారు. అయితే ఆప్‌ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు