- బోగస్ రేషన్ కార్డుల తొలగింపును ఈకెవైసీ అమలు
హైదరాబాద్ : తెలంగాణలో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, అనర్హుల రేషన్ కార్డులను కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన అబ్యర్థనల ఆధారంగా కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం కసతరత్తు చేస్తోంది. రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం ఇలా శుభవార్త చెప్పబోతోంది. చెప్పింది. ఇటీవలే 5 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్న సర్కార్.. తాజాగా రేషన్ కార్డులకోసం మరోచోట దరఖాస్తులు స్వీకరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాల్లో ఫిబ్రవరి చివరి వారంలోపు వీటిని సమర్పించవచ్చు. బోగస్ రేషన్ కార్డుల నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం ఈకేవైసీ చేపట్టింది. ఇది పూర్తి చేయడానికి జనవరి 31 వరకు గడువు పొడగిస్తూ పౌర సరఫరాల కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగిన ప్రజాపాలనలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. సబ్సిడీ సిలిండర్ల కోసం మొత్తం 91.49 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 92.23 లక్షల మంది మహిళలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.