Tuesday, May 7, 2024

మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి

తప్పక చదవండి
  • మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
  • కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ డా. బి. గోపి
    కరీంనగర్‌ :మాదక ద్రవ్యాల వినియోగంతో ఎదుర్కోనే అనారోగ్య సమస్యలను గురించి ప్రజలతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ డాః బి. గోపి అన్నారు. శుక్రవారం కలెక్టరెట్‌ ఆడిటోరియంలో మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలపై పోలీస్‌ కమీషనర్‌, జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లవైపు ఆకర్షణ అయితే వచ్చే నష్టాలు కుటుంబీకులు పొందే దుఃఖాలు వివరిస్తూ చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. జిల్లాలో గంజాయి, గుడుంబా వినియోగం జరగకుండా పూర్తిగా నిరోదించాలని,ఆ దిశగా జిల్లాలోని మోడల్‌ స్కూల్‌, కళాశాల విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి షాపులలో డ్రగ్స్‌ అమ్మకాలు జరపకుండ పటిష్టచర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపి సుబ్బారాయుడు, జిల్లా వైద్యాధికారి లలితదేవి, అడిషనల్‌ డి.సి.పి లు సి. రాజు,( పరిపాలన ), ఎ. లక్ష్మి నారాయణ (శాంతి భద్రతలు), ఆర్డీవో కె.మహేశ్వర్‌, ఎ.సి.పి లు నరేందర్‌, కరుణాకర్‌ రావు, జీవన్‌ రెడ్డి, సర్వర్‌,మాధవి, విజయకుమార్‌, ప్రతాప్‌,హరిశంకర్‌ (లీగల్‌ అడ్వైసర్‌ ), అసిస్టెంట్‌ ఎక్స్సైజ్‌ సూపరింటెండెంట్‌ తాతాజీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు