Tuesday, October 15, 2024
spot_img

కోట్లు మింగుతున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌..

తప్పక చదవండి
  • కోనారెడ్డి చెరువు మరమ్మత్తు పేరుతో దగా చేస్తున్న వైనం..
  • తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు బక్క జడ్సన్‌..
    పర్వతగిరి : కోనారెడ్డి చెరువు మరమ్మతుల కాంట్రాక్ట్‌, వేరే వారి పేరుపై వచ్చిన కాంట్రాక్టును సుమన్‌ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్‌ లు ఇద్దరూ కలిసి సబ్‌ కాంట్రాక్ట్‌ సంపాదించుకొని, చెరువు సాక్షిగా కోట్ల రూపాయలు దోచుకుంటున్నట్లు మండల ప్రజలు నివ్వెరపోతున్నారని.. వర్ధన్నపేట మండల కేంద్రంలోని కోనారెడ్డి చెరువును శుక్రవారం పరిశీలించిన కాంగ్రెస్‌ పార్టీ ఎఐసిసి సభ్యులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ చైర్మన్‌ బక్క జడ్సన్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్ధన్నపేట మండలానికి సమీపంలో ఉన్న కోనారెడ్డి చెరువు మరమ్మత్తు కోసం ఎక్కువ రూపాయలు ఎస్టిమేషన్‌ వేసి.. అంటే సుమారు 18 కోట్ల 50 లక్షల రూపాయలు వేసి, ప్రభుత్వానికి పంపితే, ఈ కాంట్రాక్టుపై విషయం సీఎం కార్యాలయానికి తెలియగానే, ప్రభుత్వం హైదరాబాద్‌ నుండి ఒక అధికారిని పంపి, మళ్ళీ రీ ఎస్టిమేషన్‌ వేయించి, రూ. 13 కోట్ల 50 లక్షలు తగ్గించారు. అంటే ఎంత ఎక్కువ వేసి పంపారో, వారు ప్రజాధనాన్ని కోట్ల రూపాయలలో దోచుకోవడానికి పంపినారో మనం తెలుసుకోవచ్చునని బక్క జడ్సన్‌ అన్నారు. ఈ కాంట్రాక్ట్‌ వర్క్‌ ను మళ్ళీ రీ ఎస్టిమేషన్‌ వేసి పంపితే, సుమారు 15 కోట్ల 50 లక్షలకు ఫైనల్‌ చేశారని తెలిపారు. కోనారెడ్డి చెరువు మరమ్మతుకు రూ. 5 కోట్ల లోపు అయ్యే పనికి స్థానిక ఏ.ఈ. లను, డీఈ లను ఏ విధంగా లోపరుచుకొని ఎస్టిమేషన్‌ వేయించారో సదరు ఎమ్మెల్యే అరూరి రమేష్‌ వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏ పనైనా ఎక్కువ ఎస్టిమేషన్‌ వెయ్యాలని, అందులో సగానికి సగం అక్రమార్జనకు పాల్పడాలనేదే ఎమ్మెల్యే అసలు నైజం అని అన్నారు. వర్ధన్నపేట నియోజవర్గంలో ఏ పనైనా ఇదే పరిస్థితి.. ఇదే కోనారెడ్డి చెరువుకు మరో రూ. 5 కోట్లు కూడా ఇటీవల మళ్లీ ఎస్టిమేషన్‌ వేసి ప్రభుత్వానికి పంపినాడని, పనిలో జాప్యం కారణంగా యధా స్థితితో ఉన్న చెరువును మళ్ళీ ఇప్పుడు డ్యామేజ్‌ చేసి, మరో కొన్ని కోట్లకు ప్లాన్‌ వేసినాడని, ఇప్పుడు ఈ చెరువు కట్ట తెగే పరిస్థితి వచ్చింది.. అంటే, 100 కు 100 శాతం పనిలో జాప్యం.. ఎన్ని కోట్ల పనికి, ఎంత మంది పనిచేయాలి ? ఎన్ని యంత్రాలు పని చెయ్యాలి ? కానీ, అక్కడ పని వాళ్ళు అతి తక్కువ, మేషినరీ కూడ ఒకటి రెండు అంతేనని జడ్సన్‌ అన్నారు. ఈ చెరువు కట్టను తెగే పరిస్థితి తీసుకు వచ్చి, నిజాంల కాలంలో పకడ్బందీగా ఉన్న మత్తడిని జెసిబి సహాయంతో కూకటి వేళ్ళతో తీసి వెయ్యండం, అంతే కాకుండా 2500 ఆయకట్టు గల చెరువులో చుక్క నీళ్లు కూడా మిగలకుండా చెయ్యడంతో ఈ ఆయకట్టు రైతులు, మండల ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారని, ఈ చెరువులో నీళ్ళు ఉంటేనే వర్ధన్నపేట మండల కేంద్రంలో భూగర్భ జలాలు సమృద్దిగా ఉంటాయని, ఇప్పుడు పంటలు, నీళ్లు పోయినందున, ఆయకట్ట రైతులు తీవ్ర ఆవేదనతో బాధను వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు