Tuesday, May 21, 2024

ఇజ్రాయెల్‌పై దాడి ఉగ్రవాద చర్యే: ఎస్‌. జైశంకర్‌ రోమ్‌

తప్పక చదవండి

ఉగ్రవాద చర్య ఎప్పటికీ ఆమోదయోగ్యమైనది కాదని భారత విదే శాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. ఇటలీలోని రోమ్‌లో విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిషన్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన.. ఇజ్రాయెల్‌హమాస్‌ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7న జరిగిన దాడులు ఉగ్రవాద చర్యేనన్నారు. ఇది ఎంత మాత్రమూ ఆమోద యోగ్యం కాదని.. అదే సమయంలో పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరముందని తెలిపారు. ‘అక్టోబర్‌ 7న జరిగింది ఉగ్రవాద చర్యే. దాని వల్లే ఇజ్రాయెల్‌గాజాలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జరుగుతోన్న ఈ ఘర్షణలు అక్కడ సర్వసాధారణం కాబోవని, మళ్లీ స్థిరత్వం ఏర్పడుతుం దని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు మనం రెండు భిన్నమైన సమస్యలకు పరిష్కారం వెతకాలి. ఉగ్రవాదమైతే దానికి వ్యతిరేకంగా మనమంతా కలిసికట్టుగా పోరాడాలి. కానీ, ఇక్కడ పాల స్తీనాకు సంబంధించిన అంశం కూడా ఉంది. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కా రం చూపించాలి. ‘టూ స్టేట్స్‌ విధానం’ సరైన పరిష్కారమని మా అభిప్రాయం. యుద్ధం, ఉగ్రవాదం వల్ల పరిష్కారం లభించదు. ఈ సమస్యకు చర్చలు, సంప్రదింపుల ద్వారానే పరిష్కారాన్ని అన్వేషిం చాలి. ఇందుకు మేం మద్దతిస్తాం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మానవతా చట్టాలను గౌరవిస్తారని విశ్వసిస్తున్నాం‘అని జైశంకర్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు