Friday, May 17, 2024

షమీకి అర్జున అవార్డు

తప్పక చదవండి
  • ఏపీ బ్యాడ్మింటన్‌ స్టార్‌కు ఖేల్‌ రత్న
  • నేషనల్‌ స్పోర్ట్స్‌ అవార్డ్స్‌ను ప్రకటించిన కేంద్రం

2023 సంవత్సరానికి గానూ నేషనల్‌ స్పోర్ట్స్‌ అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇండియాలో క్రీడా రంగంలో అతిపెద్ద పురస్కారం ‘ఖేల్‌ రత్న’కు ఇద్దరు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు ఎంపికయ్యారు. సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ చంద్రశేఖర్‌ శెట్టికి ఈ అవార్డును ప్రకటించారు. ఇక.. 26 మందికి అర్జున అవార్డ్స్‌ ను ప్రకటించింది కేంద్రం. అందులో క్రికెటర్‌ మహమ్మద్‌ షమీకి అర్జున అవార్డు లభించింది. ఈ జాబితాలో పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి పేరు కూడా ఉంది. అంతేకాకుండా.. ఏపీకి చెందిన టీమిండియా అంధుల క్రికెట్‌ కెప్టెన్‌ ఇల్లూరి అజయ్‌ కుమార్‌ రెడ్డి కూడా అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. పవన్‌ కుమార్‌ (కబడ్డీ), సునీల్‌ కుమార్‌ (రెజ్లింగ్‌), వైశాలి (చెస్‌) అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. కాగా.. సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్‌లో భారత జెండాను ఎగురవేశారు. హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో ఈ జోడీ భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించింది. మరోవైపు.. 2023 ప్రపంచకప్‌లో మహమ్మద్‌ షమీ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
జాతీయ క్రీడా పురస్కారాల విజేతలు.. మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న.. చిరాగ్‌ శెట్టి- సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి (బ్యాడ్మింటన్‌). అర్జున అవార్డులు: ఓజాస్‌ ప్రవీణ్‌ డియోటాలే (ఆర్చరీ) అదితి గోపీచంద్‌ స్వామి (ఆర్చరీ) మురళీ శ్రీశంకర్‌ (అథ్లెటిక్స్‌) పారుల్‌ చౌదరి (అథ్లెటిక్స్‌), మొహమీద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), ఆర్‌ వైశాలి (చెస్‌), మహ్మద్‌ షమీ (క్రికెట్‌), అనుష్‌ అగర్వాలా (ఈక్వెస్ట్రియన్‌), దివ్యకృతి సింగ్‌ (ఈక్వెస్ట్రియన్‌ డ్రెస్సేజ్‌), దీక్షా దాగర్‌ (గోల్ఫ్‌), క్రిషన్‌ బహదూర్‌ పాఠక్‌ (హాకీ), సుశీల చాను (హాకీ), పవన్‌ కుమార్‌ (కబడ్డీ), రీతు నేగి (కబడ్డీ), నస్రీన్‌ (ఖోఖో), పింకీ (లాన్‌ బౌల్స్‌), ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ (షూటింగ్‌), ఈషా సింగ్‌ (షూటింగ్‌), హరీందర్‌ పాల్‌ సింగ్‌ సంధు (స్క్వాష్‌), ఐహికా ముఖర్జీ (టేబుల్‌ టెన్నిస్‌), సునీల్‌ కుమార్‌ (రెజ్లింగ్‌), ఆంటిమ్‌ (రెజ్లింగ్‌), నౌరెమ్‌ రోషిబినా దేవి (ఉషు), శీతల్‌ దేవి (పారా ఆర్చరీ), ఇల్లూరి అజయ్‌ కుమార్‌ రెడ్డి (బ్లైండ్‌ క్రికెట్‌), ప్రాచీ యాదవ్‌ (పారా కానోయింగ్‌). ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్‌ కేటగిరీ): లలిత్‌ కుమార్‌ (రెజ్లింగ్‌), ఆర్‌బీ రమేష్‌ (చెస్‌), మహావీర్‌ ప్రసాద్‌ సైనీ (పారా అథ్లెటిక్స్‌), శివేంద్ర సింగ్‌ (హాకీ), గణేష్‌ ప్రభాకర్‌ దేవ్రుఖ్కర్‌ (మల్లాఖాంబ్‌). ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌ టైమ్‌ కేటగిరీ): జస్కిరత్‌ సింగ్‌ గ్రేవాల్‌ (గోల్ఫ్‌) భాస్కరన్‌ ఇ (కబడ్డీ), జయంత కుమార్‌ పుషీలాల్‌ (టేబుల్‌ టెన్నిస్‌). ధ్యాన్‌ చంద్‌ జీవిత సాఫల్య పురస్కారం: మంజుషా కన్వర్‌ (బ్యాడ్మింటన్‌) వినీత్‌ కుమార్‌ శర్మ (హాకీ) కవిత సెల్వరాజ్‌ (కబడ్డీ)

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు