Saturday, May 18, 2024

చాలి చాలని జీతాలతో ఆంగన్వాడీలు

తప్పక చదవండి

హోరెత్తిన ఆంగన్వాడీల నిరసనలు
మన భారతదేశం అధిక జనాభా, అందువల్ల అసంతులన ఆహా రం, పేదరికం, పసిపిల్లల మరణాల రేట్లు బాధపడుతున్న దేశం. ఆరోగ్య, మరణాల సమస్యలు ఎదుర్కోవడానికి వైద్య, ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఒక గొప్ప అవసరం ఉంది. అందువలన, అంగన్వాడీ వ్యవస్థ ద్వారా, దేశం సరసమైన, స్థానిక జనాభా కోసం అందుబాటులో ఉండడం జరుగుతుంది, మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు పోష్టిక ఆహారం అందించడం వారి లక్ష్యంగా పనిచేస్తు న్నారు. బాల బాలికలకు, గర్బవతులకు (ముఖ్యంగా పేద వారి పిల్లలకు, పేద మహిళలకు) పుష్టికరమైన ఆహారము (సం పూర్ణ ఆహారము) అందటంలేదని, వారికి పౌష్టికాహారం అందిం చాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము, ఆంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ఆంగన్వాడీ కేంద్రం సిబ్బం దికి, కేంద్ర ప్రభుత్వం కొంత వాటా, రాష్ట్రప్రభుత్వం కొంత వాటా కలిపి, జీతంగా ఇస్తున్నాయి అయినా కనీస వేతనం చెల్లించ కుండా అధిక పని బారంతో పాటు ఎటువంటి ఆరోగ్య భద్రత, క్రమబద్దీ కరణ చెయ్యకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. కనీస వేతనం పాతిక వేలకు పెంపు, ఉద్యోగ క్రమబద్దీకరణ, పని భారం తగ్గింపు వంటి డిమాండ్లతో ఆంగన్వాడీలు సమ్మె బాట పట్టారు. రాష్ట్రవ్యా ప్తంగా దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరసన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ల ముట్టడికి పిలుపునిచ్చారు.. పోలీసులు కట్టడి చేసే క్రమంలో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేసే దిశగా ఆంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లతో ఆంగన్వాడీలు నిరసనలతో హోరెత్తించారు. ఏళ్లుగా పని చేస్తున్నా.. ప్రభుత్వపరంగా తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీతాలు వారికి సరిపోడం లేక. వారి పిల్లలను చదివించాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మా సమస్యలు పరిష్కరించండి. మా రిటైర్మెంట్‌ వయస్సు 60 సంవత్సరాలు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ని కోరుకుంటున్నారు, వారికి హెల్త్‌ కార్డులు ఇప్పించాలి. సమ్మెలో వారు చేసిన డిమాం డ్స్‌ అన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.. మట్టి కర్చులు అంటూ అంగ న్వాడీ టీచర్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం అవమనిస్తుంది, ఉద్యోగులు బతికున్నప్పుడు కావాల్సిన వాటిని పక్కకు పెట్టి, చనిపోయాక దహన సంస్కారాలకు డబ్బులు ఇస్తామనడం దుర్మార్గపు చర్యగా అభివర్ణింస్తున్న,చాలి చలని వేతనాలతో ఉన్న వారికి జీతం పెంచాలి అని వేడుకుంటున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం మట్టి కర్చులు ఇస్తామనడం ఎంత వరకు సబబు, ఇప్పటికీ అయినా రాష్ట్ర ప్రభు త్వం అంగన్వాడీ టీచర్లతో చర్చలు జరిపి వారికి అనుకూలంగా స్పందిస్తారు అని ఆశిస్తున్న, అంగ న్వాడి టీచర్స్‌ గర్భిణీలు, బాలిం తలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిం చడంలో అంగన్వాడీ ఉద్యోగులు అందిస్తున్న సేవలను ప్రభుత్వం విస్మరిస్తుంది పండెం డు రోజులగా సమ్మె చేస్తున్న ప్రభు త్వం పట్టించుకోవడం లేదు అని వాపోతున్నారు. వెంటనే ప్రభు త్వం స్పందించి అంగన్వాడి ఉద్యోగులను క్రమబద్ధీకరిం చడంతో పాటు సమస్యలను పరిష్కరించాలి, ప్రభుత్వ నిర్బంధాలను, ఎదుర్కొని స్థానికంగా రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తున్నా వారికి మద్దతు తెలియజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి వారి పక్షాన గొంతు వినిపిం చాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగుతున్నారు రోడ్లు ఎక్కుతారా అని, రేపు రాబోయే ఎన్నికలలో వారు ఎలా రోడ్డు ఎక్కి గల్లి గల్లి తిరుగుతూ పోయిన ఇళ్లుకే పలుమార్లు ఎలా పోతారు..? దర్నలో ఉన్నారు అని వారి సమ స్యల పరిష్కారానికి సమాధానం ఇవ్వక వారు విధులు నిర్వ హిం చిన కేంద్రాల తాళాలు పగులకొట్టి వారిని ఇంకా అవమాన పరు స్తున్న స్థానిక నేతలు ఇకనైనా వారి నియంత పోకడలు బంద్‌ చేసి అంగన్వాడి ఆడబిడ్డలకు అండగా ఉంటారు అని ఆశిస్తున్నాను.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు