Sunday, May 12, 2024

కెనడాలో పురాతన లక్ష్మీ నారాయణ ఆలయం ధ్వంసం…

తప్పక చదవండి

ఒట్టావా‌: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో ఉన్న అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్‌ మద్దతుదారులు కూల్చివేశారు అంతటితోఆగని దుండగులు.. ఆలయం దర్వాజకు జూన్‌ 18న జరిగిన గురుద్వారా సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల హత్యలో భారత్‌ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తున్నదంటూ ఉన్న పోస్టర్లను అంటించిపోయారు. అందులో గురు నానక్‌ సిఖ్‌ గురుద్వారా సాహిబ్‌ సర్రే చీఫ్‌ హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఫొటో కూడా ఉన్నది.కాగా, కెనడాలో ఈ ఏడాది ఇప్పటివరకు మూడు ఆలయాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఏడాది జనవరి 31న బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని భారత వ్యతిరేకులు ధ్వంసం చేశారు. అదేవిధంగా గత ఏప్రిల్‌లో ఒంటారియోలో మరో దేవాలయాన్ని కూల్చివేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు