Saturday, April 27, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

సోదరా…! నిన్ను నిన్నుగా నడిపించే
ధైర్యం నీ నమ్మకమన్న నిజాన్ని
ఎన్నడూ మరిచిపోకు..
లక్ష్యాన్ని సాధించే మార్గాలను
వెతుకుతూ.. వెతుకుతూ..
నడి సముద్రంలోనే ఏకాకిలా మునిగిపోకు..
కెరటాలకు భయపడి నావ తీరం చేరదు..
లక్ష్యమే దాని తుది నిర్ణయమని గ్రహించు..
ఆహారాన్ని చేర్చటమే చీమ లక్ష్యము,
పడుతూ లేస్తూ పూర్తి చేస్తుంది ఎప్పుడు…
విష సర్పాలనే మైమరపించే మొగలిరేకువై
నిర్భయంగా ముందుకు నడువు..
రేపటి చింత వదిలి, నేడు సవ్యంగా గడిస్తే చాలు అనుకుంటూ లక్ష్యానికై ప్రయత్నించు..
గెలుపు ఓటమిలకు ఎన్నడూ భయపడకు, లక్ష్య సాధనే నీ తుది గెలుపు…!!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు