Sunday, December 3, 2023

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

ప్రకృతి ప్రేమతో పురుడుపోసుకుని..
శ్రమ జీవుల చెమట చుక్కలతో
పుట్టిన సాహిత్యం..
అణచబడిన హక్కుల కోసం అరచిన కవిత్వం
ఎప్పుడూ దొరలకు దండం బెట్టదు..
కప్పే శాలువాకి సహో అనదు సాహిత్యం..
ప్రశంస పత్రం కోసం పాకులాడదు పాట..
జ్ఞానం ఇచ్చే జ్ఞాపిక కోసం.. గడిలో బంది అవదు..
చింత చెట్టంత అక్షరానికి చిగురంత శాలువా
కంటికి కనబడదు.. ఆలోచన అక్షరం
ఆకలితో అరుస్తున్న ఆవేదనల వైపే..

      - సుమన్ గౌడ్
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు