Saturday, July 27, 2024

అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ

తప్పక చదవండి
  • మణిపూర్‌ను దేశంలో భాగంగా చూడడం లేదు
  • భారతమాతను హత్యచేశారన్న రాహుల్‌
  • రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల ఆగ్రహం
  • రాహుల్‌ తీరును తూర్పారబట్టిన మంత్రి స్మృతి
  • ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్నారన్న కిరణ్‌
  • ప్రసంగం ముగించి సభను వీడిన ఎంపీ రాహుల్‌
    న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండోరోజు బుధవారం చర్చలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మణిపూర్‌లో మహిళలను హత్య చేయడమంటే భారతమాతను హత్య చేయడమేనని, మణిపూర్‌ను రెండు వర్గాలుగా విభజించారని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌ను దేశంలో భాగంగా గుర్తించడం లేదని, మోడీ అక్కడ పర్యటించలేదని, ఆయనో రావణాసురుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే రాహుల్‌ చేయాల్సిన విమర్శలు చేసి, సభనుంచి నిస్కమ్రించారు. ఈ క్రమంలో రాహుల్‌ తీరుపైనా, ఇండియా కూటమిపైనా స్మృతి ఇరానీ ఘాటు వ్‌ఆయఖ్యలు చేశారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానంపై రాహుల్‌ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, స్పీకర్‌ సార్‌, లోక్‌సభలో నన్ను పునర్నియమించి నందుకు ధన్యవాదాలు. గతంలో నేను మాట్లాడినపుడు, నేను అదానీ మీద, మీ సీనియర్‌ నేతల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. అందువల్ల నేను బహుశా మిమ్మల్ని బాధించి ఉంటాను. ఈరోజు నేను అదానీ గురించి మాట్లాడనని చెప్పారు. సుప్రసిద్ధ పర్షియన్‌ కవి రుమిని ప్రస్తావిస్తూ, తాను బీజేపీ మీద అన్ని వైపుల నుంచి దాడి చేయబోవడం లేదన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావిస్తూ మణిపూర్‌ అంశంపై మాట్లాడారు. మణిపూర్‌ రాష్ట్రాన్ని దేశంలో భాగంగా మోడీ సర్కార్‌ చూడడం లేదని విమర్శలు చేశారు. తాను మణిపూర్‌కి వెళ్లి అక్కడి బాధితులను పరామర్శించానని, ప్రధాని మోడీ మాత్రం ఇప్పటి వరకూ ఆ పని చేయలేదని విమర్శించారు. ’ప్రధాని మోడీకి మణిపూర్‌ మన దేశంలోని భాగం కాదు. ఆ రాష్ట్రాన్ని మోడీ సర్కార్‌ ముక్కలు చేసింది’ అంటూ విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారత్‌ని హత్య చేశారంటూ తీవ్రంగా విమర్శించారు. మణిపూర్‌లో పర్యటించినప్పుడు చాలా మంది బాధితులను ఓదార్చినట్టు వెల్లడిరచారు. కళ్లముందే భర్తను కాల్చి చంపినట్టు ఓ బాధితురాలు తనతో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నట్టు వివరించారు. విమర్శల్లో భాగంగా ప్రధాని మోడీని రావణాసురుడితో పోల్చారు. రావణాసురుడి ఇద్దరి మాటలనే వినేవాడని, మోడీ కూడా అదానీ, అమిత్‌షా మాటలు తప్ప ఇంకెవరి మాటల్నీ వినిపించుకోరని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్‌ మన దేశంలో భాగంగానే కనిపించడం లేదు. ఆ రాష్ట్రంలో ఇండియాని బీజేపీ హత్య చేసింది. మణిపూర్‌ రెండు ముక్కలుగా చీలిపోయిందనేది వాస్తవం. అసలు ఇప్పుడా రాష్ట్రం ఉనికే కనిపించడం లేదు. బీజేపీ ఎంపీలు మమ్మల్ని రాజస్థాన్‌కి వెళ్లమని సలహా ఇచ్చారు. నేను వెళ్తున్నాను. ప్రధాని మోడీ రావణాసురుడిగా మారిపోయారు.

  • మొత్తం దేశాన్ని తగలబెడుతున్నారు. ముందు మణిపూర్‌తో మొదలు పెట్టారు. ఇప్పుడు హరియాణాలో ఇదే జరుగుతోంది. దేశం మొత్తాన్ని ఇలా తగలబెట్టాలను కుంటున్నారని రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా తనకు చాలా మంది గొప్ప శక్తిని, బలాన్ని అందించారన్నారు. ఈ యాత్రలో తనకు ఓ బాలిక ఓ లేఖ ఇచ్చిందని, అందులో, రాహుల్‌, నేను మీతో కలిసి నడుస్తున్నానని ఉందని తెలిపారు. ఆమె మాత్రమే కాకుండా అనేక మంది తనకు బలాన్ని ఇచ్చారని చెప్పారు. తనకు బలాన్నిచ్చినవారిలో రైతులు ఉన్నారన్నారు.
    అదానీ వ్యవహారం పై మాట్లాడనంటూ బీజేపీపై సెటైర్లు వేశారు. ఇదే క్రమంలోనే అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. ముందుగా భారత్‌ జోడో యాత్ర గురించి మాట్లాడారు. తన యాత్ర ఇంకా ముగిసిపోలేదని, రెండోసారి యాత్ర నిర్వహిచేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. నేను చివరిసారి మాట్లాడినప్పుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి ఉంటాను. ఎందుకంటే నేను అప్పుడు అదానీ వ్యవహారంపై మాట్లాడాను. బహుశా మీ సీనియర్‌ లీడర్‌ బాధ పడ్డారేమో అంటూ పరోక్షంగా మోడీపై విమర్శలు గుప్పించారు. బహుశా ఆ బాధ మీపైన కూడా ప్రభావం చూపించి ఉండొచ్చు. అందుకు నేను మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. కానీ నేను మాట్లాడిరది నిజం. కానీ ఈ సారి బీజేపీ మిత్రులు ఏం భయపడాల్సిన పనిలేదు. నేను ఇప్పుడు అదానీ గురించి మాట్లాడడం లేదని అన్నారు. రాహుల్‌ ప్రసంగిస్తుండగా బీజేపీ ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. ఆ సమయంలో రాహుల్‌ రూమీ కొటేషన్‌ని ప్రస్తావించారు. ‘మనసులో నుంచి వచ్చే మాటలు ఎప్పుడూ… మనసుని తాకుతాయి’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. భారత్‌ జోడో యాత్ర గురించి.. రాహుల్‌ చెబుతూ ఈ యాత్రకు వెళ్లే ముందు తనలో అహంకారం ఉండేదని, అహంకారంతోనే తాను ఈ యాత్రను ప్రారంభించానని చెప్పారు. ఈ యాత్ర తన జీవితాన్ని మార్చేసిందన్నారు. ఈ యాత్రలో నిజమైన భారత దేశాన్ని చూశానని తెలిపారు. యాత్ర కోసం అన్నిటినీ త్యాగం చేయడానికి సిద్ధమయ్యానన్నారు. ప్రజా గళాన్ని విన్నానని చెప్పారు. ఈ యాత్రలో ప్రజలు తనకు ఎంతో సహాయం చేశారని, పేదల బాధలను అర్థం చేసుకున్నానని చెప్పారు. హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్‌ రాష్ట్రంలో తాను పర్యటించానని చెప్పారు. తాను సహాయక శిబిరాలకు వెళ్లానని, దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో తాను మాట్లాడానని తెలిపారు. కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని చెప్పారు. భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. మణిపూర్‌ మహిళల బాధలు బీజేపీకి అర్థం కావడంలేదన్నారు. భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని, మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు ద్రోహులని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పరోక్షంగా రావణాసురుడితో పోల్చారు. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడని, మోడీ కూడా ఇద్దరి మాటలనే వింటారని, వారిద్దరూ అమిత్‌ షా, అదానీ అని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అధికార పక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం ఏర్పడిరది. ఇకపోతే భారత మాతపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నోరు జారకూడొద్దంటూ మందలించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత మాతపై రాహుల్‌ అలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్‌ ఎంపీలు చప్పట్లు కొట్టడం సిగ్గు చేటు అంటూ మండి పడ్డారు.
    ఆ పార్టీ వైఖరేంటో దీంతో తేలిపోయిందని తేల్చి చెప్పారు. రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ’మీరు ఇండియా కానే కాదు. అవినీతిని మొదలు పెట్టిందే మీరు. ప్రస్తుతం దేశ ప్రజలు వారసత్వ రాజకీయాలను కాదు అభివృద్ధిని విశ్వసిస్తున్నారు. మీ లాంటి వాళ్లు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాలని స్మృతి ఇరానీ అన్నారు. భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని, మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైందని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయేన ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తు న్నారని మండిపడ్డారు.కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. మీరు ఇండియా కాదు అని దుయ్యబట్టారు. మీది ఇండియా కాదు, అవినీతికి ప్రతిరూపం అని ప్రతిపక్ష కూటమి పేరును ఉద్దేశించి ఆరోపించారు. మణిపూర్‌ విడిపోలేదన్నారు. మణిపూర్‌ భారత దేశంలో అంతర్భాగమన్నారు.
    దేశంలో ఎంతో మందిని హత్య చేసిన చరిత్రగల కాంగ్రెస్‌ భారత దేశాన్ని హత్య చేసినట్లు చెప్పడంలో అర్థం లేదన్నారు. దేశంపట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, కాంగ్రెస్‌ పార్టీకి అటువంటి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మణిపూర్‌ను ఎవరూ విభజించలేరని, ముక్కలు చేయలేని స్పష్టం చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు