Friday, July 19, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

గద్దెకెక్కినంక ప్రజలు తిప్పలు వడుతుంటే సెవికెక్కలేదేమో బహుశా.. ఎలక్షన్లు అచ్చుడుతోనే పన్నాగాలు షురూ జేసిర్రు.. ఐదేండ్లుగా మనూరి దిక్కే రాని నాయకులు గిప్పుడే అస్తున్నారెందుకో ? రైతుల రుణమాఫీలు, కండక్టర్ల విలీనం, ఏళ్లపాటు జరగని పనులన్నీ గిప్పుడే గుర్తొస్తున్నయేమో..
ఇన్నేళ్లుగా రాని ఉద్యోగ నోటిఫికేషన్లు వరుదలై వరుస పెడుతున్నాయ్‌.. కారు దిగి కాలు కింద పెట్టని నాయకులు పాదయాత్రలు జేస్తారు.. దండాలు వెట్టుకుంట, హామీలిచ్చుకుంట, ఓట్ల కోసం నోట్ల ఎరలు వేస్తారు.. ఓ ప్రజలారా, గొర్రె కసాయోన్ని నమ్మినట్లు మనం కూడా ఈ కసాయి నాయకుల్ని నమ్ముదామా ? గీసారైనా జెర ఆలోచించి ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం..
` కాల్వ నిఖిత

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు